News October 6, 2025
టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్.. ఫ్రీగా పంపిస్తున్నారా?

సొంతూళ్లకు వెళ్లి మహానగరానికి తరలివస్తోన్న వారితో HYD శివారు హైవేలపై భారీగా <<17927176>>ట్రాఫిక్ జామ్<<>> అవుతోంది. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూ ఉంటోంది. అలాంటి సమయంలో వాహనాలను టోల్ లేకుండా పంపాలని NHAI నిబంధనల్లో ఉంది. క్యూ లైన్ 100మీటర్ల పసుపు గీతను దాటినా.. సాంకేతిక సమస్యలతో వాహనం 10 సెకన్ల కంటే ఎక్కువ వేచి ఉన్నా ఉచితంగా వెళ్లొచ్చు. ఇవి ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించినవి.
Similar News
News October 6, 2025
ప్రభుత్వ వైఫల్యంతోనే కరూర్ తొక్కిసలాట : NDA MPలు

కరూర్(TN) తొక్కిసలాటలో 41 మరణాలపై NDA MPలు నివేదిక రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యమే కారణమని తేల్చారు. జనాల సంఖ్యపై అంచనాలేమి, క్రౌడ్ మేనేజ్మెంటులో వైఫల్యం ఉందన్నారు. 3వేల మంది పట్టే గ్రౌండ్‌లో 30వేల మంది గుమిగూడారు. 2 గం.కు రావలసిన విజయ్ రాత్రి 7 గం.కు వచ్చారు. ఆయన బస్సుపైకెక్కి అభివాదం చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. నివారించదగ్గదే అయినా అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వల్ల ఇది జరిగిందని పేర్కొన్నారు.
News October 6, 2025
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే

❂ అక్టోబర్ 8: మెయింటెనెన్స్ రిక్వైర్డ్(ప్రైమ్ వీడియో)
❂ అక్టోబర్ 9: వార్ 2(నెట్‌ఫ్లిక్స్-సినీ వర్గాల సమాచారం)
❂ అక్టోబర్ 10: మిరాయ్(జియో హాట్‌స్టార్)
❂ త్రిబాణధారి బార్బరిక్(సన్ నెక్స్ట్)
❂ స్థల్(జీ 5)
❂ స్విమ్ టు మీ(నెట్‌ఫ్లిక్స్)
News October 6, 2025
ఈ నెల 10న క్యాబినెట్ భేటీ

AP: వారం వ్యవధిలోనే మంత్రి వర్గం <<17905338>>మరోసారి<<>> సమావేశం కానుంది. ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ జరగనుంది. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.