News November 16, 2024
మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధం: రోజా
AP: రాష్ట్రంలో YCP హయాంలో వాలంటీర్ల ద్వారా 30 వేల మంది మహిళల అక్రమ రవాణా జరిగిందని TDP, JSP చేసిన ఆరోపణలు తప్పని తేలాయని మాజీ మంత్రి రోజా అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇది బట్టబయలైందని ఆమె చెప్పారు. ‘గత ఐదేళ్లలో మహిళల అక్రమ రవాణా కేసులు 34 నమోదయ్యాయని స్వయంగా హోంమంత్రే అసెంబ్లీలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధాలైనా చెప్తారా? అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
Similar News
News November 16, 2024
రోజూ 10 నిమిషాలైనా నవ్వుతున్నారా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నవ్వడమే మానేశారు. జోక్ వింటేనో, కామెడీ చూస్తేనో నవ్వుతున్నారు. రోజుకు 10 నిమిషాలైన నవ్వడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ్వడం వల్ల గుండెకు వ్యాయామం జరిగి హార్ట్ ఎటాక్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. నవ్వడంతో ఎండార్ఫిన్లు విడుదలై శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
News November 16, 2024
మంత్రి హామీ.. RTC ఉద్యోగుల ధర్నాలు వాయిదా
AP: ఈ నెల 19, 20 తేదీల్లో చేపట్టాల్సిన నిరసనలను ఎంప్లాయీస్ యూనియన్ వాయిదా వేసుకుంది. RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీతో ధర్నాలను వాయిదా వేస్తున్నట్లు EU పేర్కొంది. RTC ఉద్యోగుల అన్ని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావుతో ఫోన్లో మాట్లాడారు.
News November 16, 2024
మణిపుర్లో మళ్లీ హింస.. కర్ఫ్యూ విధింపు
మణిపుర్లో మళ్లీ కర్ఫ్యూ విధించారు. జిరిబమ్ ప్రాంతంలో మిలిటెంట్లు ఆరుగురు కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన చేపట్టారు. ఆస్తులను ధ్వంసం చేశారు. బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించి దాడి చేశారు. హింసాత్మక ఘటనలు తీవ్రం కావడంతో ఏడు జిల్లాల్లో అధికారులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.