News November 29, 2024
YCP హయాంలోనే అక్రమ రవాణా: వనమాడి
AP: YCP హయాంలోనే కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా మొదలైందని MLA వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. YCP మాజీ MLA ద్వారంపూడి ప్రమేయంతో ఇదంతా జరుగుతోందన్నారు. పేదలకు అందజేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి వ్యాపారం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. రేషన్ అక్రమ రవాణా నేపథ్యంలో <<14741555>>వనమాడిపై<<>> పవన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 29, 2024
DAO ఫలితాలు విడుదల
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) గ్రేడ్-2 ఫలితాలను TGPSC విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులకు 1,06,253 మంది దరఖాస్తు చేశారు. తాజాగా మల్టీ జోన్-1, 2 వారీగా ఫలితాలు వెలువడ్డాయి. నేరుగా హాల్టికెట్ నంబర్ చూసుకునేందుకు ఇక్కడ <
News November 29, 2024
సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల పర్యటన
AP: మాజీ సీఎం, YSRCP అధినేత YS జగన్ జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. సంక్రాంతి తర్వాత ప్రతి రోజు 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతానికి వారి నుంచి సలహాలు తీసుకోనున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ సమీక్షిస్తారు.
News November 29, 2024
PM విశ్వకర్మ పథకంపై తమిళనాడులో వివాదం
కుల ఆధారిత అసమానతలను పెంపొందించే అవకాశం ఉన్నందున ‘PM విశ్వకర్మ’ పథకాన్ని తిరస్కరిస్తున్నట్లు తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. 18 రకాల చేతి వృత్తుల కళాకారులను ప్రోత్సహించే ఈ పథకానికి వారసత్వంగా వృత్తిని స్వీకరించిన వారే అర్హులనడం వివాదమైంది. ఇతర వర్గాలను ఎంపిక చేయకపోవడం వివక్ష చూపడమే అని పేర్కొంది. అందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ తామే కొత్త పథకాన్ని తెస్తామని తెలిపింది.