News November 8, 2025
Tragedy: ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్

ఉప్పల్‌లో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. మల్లికార్జుననగర్‌లో నివాసం ఉంటోన్న శ్రీకాంత్(42) 2009 బ్యాచ్‌కు చెందిన PC. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన అక్టోబర్ 23 నుంచి విధులకు కూడా హాజరుకానట్లు తెలుస్తోంది. శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆర్థిక సమస్యలే సూసైడ్‌కు కారణమని సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 8, 2025
జూబ్లీహిల్స్: 3 రోజులు సెలవులు.. 2 రోజులు 144 సెక్షన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ రోజు 11న నియోజకవర్గంలోని Govt, Pvt ఆఫీసులు, స్కూళ్లకు సెలవు ఉంటుంది. 10న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్లలకు సెలవు ప్రకటించారు. 14న కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు ఉంటుందని కలెక్టర్ హరిచందన ప్రకటించారు. అలాగే 10న సా.6 గం. నుంచి 11న సా.6 వరకు, 14న ఉ.6 గం. నుంచి 15న ఉ.6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ సజ్జనార్ తెలిపారు.
News November 8, 2025
జూబ్లీ బైపోల్: మాగంటి మరణం చుట్టూ రాజకీయం

చావు కూడా రాజకీయాలకు అతీతం కాదని ప్రస్తుత జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నిరూపిస్తోంది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీ అని, దానిని ఛేదించాలని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం మరో ముందడుగు వేసి ఈ విషయంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బైపోల్ పాలిటిక్స్ పీక్ స్థాయికి చేరుకున్నాయి.
News November 8, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓట్లేయడానికి వస్తారా?

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4.01 లక్షల మంది ఓటర్లున్నారు. ఇంతవరకు జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా 2009లో 52% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో (2023)లో అయితే కేవలం 47.49%. ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. పోల్ పర్సెంటేజీ పెరిగితే ఆ ఓటింగ్ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది 14నే తెలుస్తుంది. అంతా పర్సెంటేజీపైనే ఆధారపడి ఉంటుంది.


