News August 14, 2024

Tragedy: పటాన్‌చెరు: చనిపోయిన లవర్ దగ్గరకు వెళ్తున్నానంటూ ఉరి

image

యువకుడి సూసైడ్ కేసు‌లో సూరారం పోలీసులు వివరణ ఇచ్చారు. INSTAలో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని గుమ్మడిదల మం.దోమడుగుకు చెందిన శ్రీహరి పట్టుబట్టాడు. పేరెంట్స్ మందలించడంతో ఆమె దూరం పెట్టింది. ఈ విషయమై యువకుడి తల్లి బెదిరించగా యువతి సూసైడ్ చేసుకుంది. <<13843632>>భయంతో శ్రీహరి<<>> పురుగు మందు తాగి ఆస్పత్రి పాలయ్యాడు.ఈనెల 12న ఆస్పత్రి నుంచి పారిపోయి ‘ప్రియురాలి వద్దకే వెళ్తున్నా అంటూ’ ఉరేసుకున్నాడు.

Similar News

News February 27, 2026

మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

News February 27, 2026

తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

image

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు

News February 26, 2026

మెదక్: ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 98.26% హాజరు

image

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 28 కేంద్రాల్లో మొత్తం 98.26% మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4850 మంది, ఒకేషనల్ విభాగంలో 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, గైర్హాజరైన 95 మంది విద్యార్థుల వివరాలను వెల్లడించారు.