News August 31, 2024

విషాదం.. రెండు నెలల్లో 150 మంది మృతి

image

హిమచల్ ప్రదేశ్‌లో వర్షానికి సంబంధించిన ఘటనల్లో జూన్ 27 నుంచి ఇప్పటివరకు 150 మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో రూ.1,265 కోట్ల నష్టం వాటినట్లు వెల్లడించారు. అనేక చోట్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఇంకా రాష్ట్రానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Similar News

News February 1, 2025

మెగాస్టార్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్?

image

సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అలా యాక్షన్‌కు తగ్గట్లుగా ప్రేక్షకులను తమ BGMతో అలరించే సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల-మెగాస్టార్ కాంబోలో వచ్చే సినిమాకు పనిచేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను హీరో నాని నిర్మిస్తున్నారు.

News February 1, 2025

4 స్కీమ్స్‌.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు

image

TG: గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్స్‌ను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

News February 1, 2025

రాష్ట్రంలో ఉక్కపోత షురూ

image

AP: రాష్ట్రంలో రెండు రోజులుగా ఉక్కపోత మొదలైంది. కర్నూలు జిల్లా ఆదోనిలో నిన్న 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. మరోవైపు 2024 మాదిరే 2025 కూడా అత్యంత వేడి సంవత్సరంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.