News August 4, 2024

విషాదం.. ఒకే కుటుంబంలో 16 మంది మృతి

image

కేరళలోని వయనాడ్ విషాదం బాధితులకు ఓ పీడకల. మాన్సూర్(42) అనే వ్యక్తి తన కుటుంబంలోని 16మందిని పోగొట్టుకుని ఒక్కడే మిగిలాడు. చూరల్మలలో కొండచరియలు విరిగిపడ్డ రోజు అతను పని నిమిత్తం వేరే చోటుకి వెళ్లడంతో బతికాడు. కానీ అందర్నీ పోగొట్టుకుని జీవచ్ఛవంలా మిగిలానని ఆయన రోదిస్తున్నారు. ‘నా కుటుంబం, ఇల్లు అన్నీ పోయాయి. నా కూతురి డెడ్‌బాడీ దొరకలేదు. పోగొట్టుకోవడానికి నాకింకేం మిగల్లేదు’ అంటూ కన్నీరు పెట్టారు.

Similar News

News April 7, 2026

వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంత సేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇవాళ KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ ఆగే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 స్కోర్ చేసింది. ఇక 2025 ఏప్రిల్ 26న కూడా ఇదే వేదికలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయ్యింది.

News April 7, 2026

రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్

image

పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్‌ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికీ లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు.

News April 7, 2026

రాజధానిగా అమరావతి.. ముఖ్యమైన తేదీలివే!

image

➤ మార్చి 28, 2026: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.
➤ ఏప్రిల్ 1: లోక్‌సభలో అమరావతి బిల్లుపై 2గంటలకు పైగా చర్చ.. ఆపై ఆమోదం
➤ ఏప్రిల్ 2: రాజ్యసభలో గంటకు పైగా చర్చ.. అనంతరం బిల్లుకు ఆమోదం
➤ ఏప్రిల్ 6: రాజ్యసభ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బిల్లు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో అమరావతికి చట్టబద్ధత. గెజిట్ నోటిఫికేషన్ విడుదల