News March 21, 2025
నటి రజిత ఇంట్లో విషాదం

ప్రముఖ నటి రజిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి విజయలక్ష్మి(76) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు ఆమె మరణానికి సంతాపం తెలియజేశారు. రజిత 1986 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో నటించారు.
Similar News
News March 22, 2025
రాత్రి పూట త్వరగా నిద్ర పట్టడం లేదా?

చాలా మందికి రాత్రి పూట నిద్రపట్టక సతమతమవుతుంటారు. కానీ కొన్ని అలవాట్లు పాటిస్తే త్వరగా నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు బాదం పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది. గంట ముందు చెర్రీ రసం తాగితే అందులో ఉండే మెలటోనిన్ హాయిగా నిద్ర పట్టేందుకు సహకరిస్తుంది. గ్లాసు పసుపు పాలు తాగినా సుఖ నిద్ర పడుతుంది. కాఫీ, టీలు అస్సలు తాగకూడదు. ఇతర పనుల గురించి ఆలోచించకుండా ఉంటే వెంటనే నిద్ర పడుతుంది.
News March 21, 2025
వచ్చే ఏడాది పోలవరం పూర్తి: సీఆర్ పాటిల్

పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, మోదీ వచ్చాక ₹15K కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. ఈ ఏడాదీ ₹12K కోట్లు ఇచ్చారని తెలిపారు. 2026 కల్లా ప్రాజెక్టును పూర్తిచేయాలని నిర్ణయించామన్నారు. దీంతో 2.91 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని, విశాఖతో పాటు 540 గ్రామాలకు తాగు నీరు లభిస్తుందని చెప్పారు. 28.5 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
News March 21, 2025
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ వెబ్ సిరీస్

క్రైమ్ థ్రిల్లర్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్కు నీరజ్ పాండే దర్శకత్వం వహించగా జీత్, ప్రోసెన్జీత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్టవడంతో నెట్ఫ్లిక్స్ పార్ట్-2 తెరకెక్కించింది.