News August 30, 2025
అల్లు అర్జున్ ఇంట్లో విషాదం

అల్లు అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన నానమ్మ, అల్లు అరవింద్ తల్లి, అల్లు రామలింగయ్య భార్య కనకరత్నం(94) ఇవాళ అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలియడంతో బన్నీ ముంబై నుంచి HYDకు బయల్దేరారు. ఆమె చిరంజీవికి అత్త కాగా రామ్‌చరణ్‌కు అమ్మమ్మ. దీంతో మైసూరులో ఉన్న చెర్రీ HYDకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో కనకరత్నం అంత్యక్రియలు జరగనున్నాయి.
Similar News
News August 30, 2025
ఇలాంటి వాట్సాప్ గ్రూపులు అన్ని ఊర్లలో ఉంటే..!

ఎమర్జెన్సీలో రక్తం అందుబాటులో లేకపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని సంగారెడ్డిలో ‘నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్’ పేరిట 8 ఏళ్లుగా వాట్సాప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ, ఎవరికి రక్తం అవసరమైనా దాంట్లో మెసేజ్ చేస్తే చాలు దగ్గరున్నవాళ్లు అక్కడికి వస్తారు. ఇలాంటి వాట్సాప్ గ్రూప్స్ ప్రతి గ్రామానికీ ఉంటే ఆపదలో ఉన్నవారికి ఉపయోగపడటమే కాకుండా ఊరి ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి.
News August 30, 2025
ప్రతి చెరువుకూ నీళ్లిచ్చే బాధ్యత నాది: చంద్రబాబు

AP: అసత్యాలు చెప్పడంలో YCP దిట్టని చిత్తూరు(D) పరమసముద్రం బహిరంగ సభలో CM చంద్రబాబు విమర్శించారు. ‘గేట్లతో సెట్టింగులేసి నీళ్లు తెచ్చినట్లు డ్రామాలాడటం చూశాం. మల్యాలలో మొదలైతే పరమసముద్రానికి నీళ్లు తెచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లతో నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలొచ్చాయి. రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాదని ముందే చెప్పా. ప్రతి చెరువుకూ నీళ్లిస్తాం’ అని తెలిపారు.
News August 30, 2025
రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేయాలని క్యాబినెట్ నిర్ణయం

TG: పంచాయతీల్లో రిజర్వేషన్లలో గత ప్రభుత్వం విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగ్‌ను మార్చనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ జీవో తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.