News March 27, 2025
డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం.. పవన్ సానుభూతి

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి మాదాసు సత్యవతి ఇవాళ హైదరాబాద్లో కన్నుమూశారు. సత్యవతి మరణం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, చదువుకునే రోజుల్లో వేసవి సెలవులకు వాళ్ల ఇంటికి వెళ్లేవాళ్లమని ఆయన గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
Similar News
News March 30, 2025
మా వల్లే తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం: సీఎం

AP: పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకే ఉగాది రోజు పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పాతికేళ్ల క్రితం తెచ్చిన ఐటీ వల్ల రైతులు, కూలీల పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మేం చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నాం. నేను ఏ తప్పూ చేయలేదు. భవిష్యత్తులో చేయను’ అని స్పష్టం చేశారు.
News March 30, 2025
దొడ్డు బియ్యంతో రూ.10వేల కోట్ల దోపిడీ: రేవంత్

TG: 70 ఏళ్ల క్రితమే పీడీఎస్ పథకాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. దానినే ఎన్టీఆర్ కొనసాగించారని హుజూర్ నగర్లో నిర్వహించిన కార్యక్రమంలో చెప్పారు. పేదలు అన్నం తినాలని గతంలో 90 పైసలకే బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10వేల కోట్ల దోపిడీ జరుగుతోందన్నారు. దీంతో మిల్లర్ల మాఫియా విస్తరిస్తోందన్నారు. పేదలు తినాలనే సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు.
News March 30, 2025
కోల్కతా ఫ్యాన్స్కి గుడ్ న్యూస్

కేకేఆర్ ఫ్యాన్స్కు ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిట్ గుడ్ న్యూస్ చెప్పారు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో అనారోగ్యం కారణంగా ఆడని సునీల్ నరైన్ కోలుకున్నారని ఆయన తెలిపారు. రేపు వాంఖడేలో ముంబైతో జరిగే మ్యాచ్కు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. కాగా.. RRతో మ్యాచ్లో నరైన్ స్థానంలో ఆడిన మొయిన్ అలీ 2 వికెట్లు తీశారు.