News September 3, 2024
విషాదం: తండ్రీకొడుకును మింగేసిన బుడమేరు

AP: బుడమేరు వరద విజయవాడ ప్రజల జీవితాల్లో విషాదాన్ని నింపింది. దాని ఉద్ధృతికి తండ్రీకొడుకు దుర్మరణం పాలయ్యారు. గుణదలకు చెందిన వెంకటేశ్వరరావు(63), ఆయన కుమారుడు సందీప్(35) ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలో డెయిరీ ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అక్కడికి వెళ్లినవారు సోమవారం ఉదయానికీ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు అక్కడికెళ్లి చూడగా వరద నీటిలో వారిద్దరి మృతదేహాలు కనిపించాయి.
Similar News
News February 2, 2026
తగ్గనున్న చలి.. పెరగనున్న ఎండ తీవ్రత

ఈ నెల నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల చలి తీవ్రత క్రమంగా తగ్గనుంది. అలాగే ఎండ తీవ్రత కూడా పెరుగుతుందని పేర్కొంది. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా.. కేరళ, మధ్య భారతం మినహా మిగిలిన చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సగటుకు మించి నమోదవుతున్నాయి.
News February 2, 2026
పిండి దీపం వెలిగిస్తున్నారా?

పిండి దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దీపారాధనతో గ్రహ దోషాలు, ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నారాయణుడి మంత్రోచ్చారణలతో 7 వారాల పాటు ఇలా చేయాలని సూచిస్తున్నారు. పిండి దీపం ఎలా తయారుచేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News February 2, 2026
పిగ్మెంటేషన్ రకాలు

పిగ్మెంటేషన్లో 2 రకాలున్నాయి. మొదటిది హైపర్-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన చర్మంపై ముదురు రంగు మచ్చలు, మెలస్మా, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 2వది హైపో-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన చర్మంపై లేత రంగు మచ్చలు లేదా బొల్లి – విటిలిగో ఏర్పడతాయి. వయస్సు, హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి, కొన్ని రకాల మందులు, జన్యుపరమైన అంశాలు ఈ సమస్యకు కారణం కావచ్చు.


