News August 11, 2024
విషాదం: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. అన్న కాసేపటికే..

TG: ఆసిఫాబాద్(D) గుండాయిపేటకు చెందిన పూజ (16) సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టెన్త్ చదువుతోంది. వారం క్రితం తండ్రికి ఫోన్ చేసి ‘జ్వరమొచ్చింది. కాళ్లూచేతులు గుంజుతున్నాయ్ నాన్నా. ఇంటికి తీసుకుపో’ అని చెప్పింది. తండ్రి వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. నిన్న HYDకు తరలిస్తుండగా ‘నాన్నా.. నన్ను కాపాడు’ అంటూ తండ్రి చేయి పట్టుకుని వేడుకుంది. అయినా దేవుడు కరుణించలేదు. కాసేపటికే ప్రాణాలు వదిలింది.
Similar News
News December 13, 2025
లోక్ అదాలత్లో 2 లక్షల కేసుల పరిష్కారం: LSA

AP: లోక్ అదాలత్ ద్వారా 2,00,746 కేసులను పరిష్కరించినట్లు లీగల్ సెల్ అథారిటీ సభ్యకార్యదర్శి హిమబిందు పేర్కొన్నారు. ‘వీటి ద్వారా ₹52.56CR పరిహారం చెల్లింపునకు అవార్డులు జారీచేశారు. హైకోర్టుతో సహా జిల్లాల్లో 431 లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటుచేసి కేసులు పరిష్కరించారు. చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిలహరి మార్గదర్శనంలో లోక్ అదాలత్లు జరిగాయి’ అని తెలిపారు.
News December 13, 2025
పడమర దిక్కులో బోరు బావి ఉండవచ్చా?

సాధారణంగా ఇంటికి అవసరమయ్యే నీటి వనరులు ఈశాన్యం/ ఉత్తర దిక్కులలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయినప్పటికీ పడమర దిక్కులో బోరు వేయడం వలన నీటి అవసరం తీరుతుంది కాబట్టి ఇది వాస్తు పరంగా ఆమోదయోగ్యమే అని అంటున్నారు. ‘నీరు అనేది ప్రాథమిక అవసరం కాబట్టి, దానిని మంచి స్థలంలో నిల్వ చేసుకున్నా, నిత్యం అందుబాటులోకి తెచ్చినా తప్పేం ఉండదు. దీని వలన మంచి ఫలితాలు పొందవచ్చు’ అంటున్నారు.<<-se>>#Vasthu<<>>
News December 13, 2025
రేపే రెండో విడత.. ఉ.7 గంటలకు పోలింగ్ స్టార్ట్

TG: రాష్ట్రంలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తర్వాత 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. సెకండ్ ఫేజ్లో 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 స్థానాలు, 38,322 వార్డులకు 8,300 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అధికారులు అందజేశారు.


