News September 28, 2024

విషాదం.. ఆవును కాపాడబోయి నలుగురు మృతి

image

ప.బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లాలో విషాదం జరిగింది. ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడబోయి ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. నిన్న ఇంటి బయట నీటిలో పడి ఉన్న కరెంట్ వైర్ ఆవుకు తగలడంతో మిథున్ (32) దాన్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అతడికి షాక్ తగలడంతో తండ్రి పరేష్ (60), దీపాలి తల్లి (55) కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఆ ముగ్గురూ షాక్‌తో చనిపోయారు. దీపాలి చేతుల్లో ఉన్న మనవడు సైతం ప్రాణాలు వదిలాడు.

Similar News

News February 5, 2026

పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: విజయేందిర బోయి

image

పదో తరగతి విద్యార్థులు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పదో తరగతి ఎస్.సి.సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు గురువారం అంబేడ్కర్ కళా భవన్‌లో నిర్వహించిన వార్షిక పరీక్షల పై ప్రేరణ, అవగాహన తరగతుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

News February 5, 2026

లోక్‌సభకు రావద్దని మోదీకి చెప్పాను: స్పీకర్

image

ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నాయని, లోక్‌సభలోకి రావద్దని PM మోదీకి తాను సూచించినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. కొందరు MPలు లోక్‌సభ ఛాంబర్‌లో దురుసుగా ప్రవర్తించారన్నారు. ‘<<19056579>>మోదీ ప్రసంగాన్ని<<>> అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని, ఊహించని పరిస్థితికి దారితీయొచ్చని సమాచారం వచ్చింది. అదే జరిగుంటే దేశ గౌరవం దెబ్బతినేది. నిన్నటి ఘటన పార్లమెంటు చరిత్రలో మాయనిమచ్చ’ అని అన్నారు.

News February 5, 2026

90 రోజులుగా నో ఛార్జ్‌షీట్.. ‘శబరిమల’ నిందితుడికి బెయిల్!

image

శబరిమల బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి రెండో కేసులోనూ బెయిల్ వచ్చింది. అతడిని అరెస్టు చేసి 90 రోజులైనా SIT ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో కేరళ కోర్టు statutory bail మంజూరు చేసింది. ద్వారపాలక విగ్రహం, గర్భగుడి తలుపుల ఫ్రేమ్స్‌లో బంగారం మాయంపై 2కేసులు అతడిపై నమోదయ్యాయి. దర్యాప్తులో తప్పు జరుగుతోందన్న తమ ఆరోపణలు ఈ బెయిల్‌తో నిజమని తేలాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.