News March 16, 2024

మెదక్‌లో విషాదం.. బాలుడి సూసైడ్

image

మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దారిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కొమ్మ మింటూ అనే (16) బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడని కుటుంబీకులు మందలించడంతో మనస్తాపం చెంది. శనివారం ఊరి శివారులోని చెరువులో దూకేశాడు. మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 26, 2026

చేగుంట: వన్యప్రాణుల లెక్క తేలింది

image

చేగుంట మండలం ఇబ్రహీంపూర్ బీట్ పరిధి చిట్టోజి పల్లి అటవీ ప్రాంతంలో అఖిలభారత అటవీ జంతువుల గణన పూర్తయినట్లు అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ తెలిపారు. పులులు, జింకలు, అడవి పందులు, నక్కలు, హైనా, కోతులు, కుందేళ్లు, ఉడుతలు, నెమళ్లు, అడవి కోళ్ళు, పావురాలు, గద్దలు, గుడ్లగూబలు, సర్పాలు, పాములు, ఉభయచర ఉనికి, సంఖ్య, సంచార మార్గాలను నమోదు చేసినట్లు తెలిపారు.

News January 25, 2026

పటాన్‌చెరులో యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

image

పటాన్‌చెరు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ముత్తంగి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

మెదక్: ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ వేటు

image

మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానలోని పబ్లిక్ హెల్త్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేయగా, మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.