News March 16, 2024

పర్వతగిరిలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గుగులోతు తండాలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు వెంకన్న(28) తన ఇంటి ముందు బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్‌కి గురయ్యాడు. ఈ క్రమంలో అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వెంకన్నకి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ వెంకన్న తెలిపారు.

Similar News

News April 8, 2026

ఎంజీఎంలో మందుల పంపిణీ కౌంటర్ ఏర్పాటు చేయాలి: రోగులు

image

వేయి పడకల ఎంజీఎంలో రోగుల సంక్షేమం కోసం అదనంగా కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఓపి తర్వాత వైద్య పరీక్షలు అనంతరం డాక్టర్లు రాసిచ్చిన మందుల చీటీ పట్టుకుని రోగులు చాంతాడంత లైన్లో నిలబడి ఉన్నా కొందరికి మందులు లభించక వెళ్లిపోతున్న సంఘటనలు ఎంజీఎంలో నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం మరొక మందుల పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.

News April 8, 2026

సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యవంతమైన సమాజం

image

సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో బుధవారం ‘సురక్షిత మాతృత్వ దినోత్సవం’ జరిగింది. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు సరైన పోషకాహారం తీసుకోవడంతో పాటు సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

News April 2, 2026

ప్రత్యేక ధరలు, సబ్సిడీలు ఇవ్వాలని ఎంపీ కావ్య డిమాండ్

image

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతోందని, సాగు ఖర్చులు పెరిగి రైతుల ఆదాయాలు దెబ్బతింటున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు లేదా సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.