News April 2, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం

image

టాలీవుడ్‌లో మరో <<12970907>>విషాదం<<>> నెలకొంది. చిత్రకారుడు, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ పిట్టంపల్లి సుదర్శన్ కన్నుమూశారు. నల్గొండ(D) మిర్యాలగూడలోని తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. 1988లో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు. జాతీయ అవార్డు జ్యూరీలోనూ సభ్యుడిగా పనిచేశారు. మంగళవారం మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Similar News

News March 10, 2026

ఇండిగో సీఈఓ రాజీనామా

image

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇందుకు బోర్డ్ ఆమోదం తెలపగా ఆయన స్థానంలో ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలను చేపడతారు. డిసెంబరులో 2,500కుపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ కావడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ రిజైన్ చర్చనీయాంశమైంది. ఈ క్రైసిస్‌పై కేంద్రం ఆ సంస్థకు జనవరిలో ₹22కోట్ల పెనాల్టీ విధించింది.

News March 10, 2026

బ్లాక్ మార్కెటింగ్ చేస్తే చెప్పండి: మనోహర్

image

AP: రాష్ట్రంలో ఇప్పటివరకు గ్యాస్ కొరత లేదని, గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్లు ఉన్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సిలిండర్ల నిల్వలు, సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా నిఘా బృందాలతో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాంటివి ఎక్కడైనా ఉంటే ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 10, 2026

చమురులో రకాలు.. ఈ విషయం తెలుసా?

image

అమెరికా, వెనిజులా, ఇరాన్, రష్యాలో లభించే చమురులో ఉండే వ్యత్యాసాల గురించి మీకు తెలుసా? అమెరికాకు చెందిన WTI (39–41° API) అత్యంత తేలికైనది కాగా వెనిజులాకు చెందిన Merey (15–16° API) అత్యంత బరువైనది. ఇరాన్ చమురు (33–36° API) మధ్యస్థంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా అనేక రిఫైనరీలకు అనుకూలంగా ఉంటుంది. అందుకే హార్ముజ్ జలసంధిలో సరఫరా నిలిస్తే, రిఫైనరీల సామర్థ్యం తగ్గి లాభాలు పడిపోతాయి.