News April 2, 2024

టాలీవుడ్‌లో విషాదం.. 2 రోజుల్లో ముగ్గురు మృతి

image

తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రెండు రోజుల్లోనే ముగ్గురు మరణించారు. డబ్బింగ్ రచయిత <<12970907>>శ్రీరామకృష్ణ<<>>(74) చెన్నైలో కన్నుమూశారు. ఈయన జెంటిల్‌మాన్, చంద్రముఖి సహా 300+ చిత్రాలకు పనిచేశారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ <<12972286>>సుదర్శన్<<>> గుండెపోటుతో, కమెడియన్‌ <<12975511>>విశ్వేశ్వరరావు<<>> అనారోగ్యంతో చనిపోయారు.

Similar News

News April 4, 2026

దిగొచ్చిన బంగ్లా బోర్డు.. BCCIకి లేఖ

image

T20 WC టైమ్‌లో ఓవరాక్షన్ చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు ఎట్టకేలకు దిగొచ్చింది. BCCIతో విభేదాల వల్ల కలిగే నష్టాన్ని గ్రహించి సయోధ్యకు యత్నిస్తోంది. రాబోయే రోజుల్లో ద్వైపాక్షిక క్రికెట్‌కు సహకరించుకుందామంటూ లేఖ రాసింది. Septలో IND బంగ్లాలో పర్యటించాల్సి ఉందని గుర్తుచేసింది. ఆ తర్వాత బంగ్లా మహిళల జట్టు INDకు రానుందని తెలిపింది. వీటితో పాటు పరస్పర సహకారానికి ఉన్న ఇతర మార్గాలను అన్వేషిద్దాం అని కోరింది.

News April 4, 2026

టెన్త్ విద్యార్థులకు 7 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయం

image

AP: SSC పరీక్షల్లో సందిగ్ధపు సమాధానాలున్న ప్రశ్నలను అటెంప్ట్ చేసిన వారికి మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. HINDIలో 2, ENGLISHలో 5 మార్కులు కలవనున్నాయి. మరో 3ప్రశ్నలపైనా పేరెంట్స్ విన్నవించారు. కాగా ప్రశ్నల్లో పొరపాట్లు లేవని, విద్యార్థి సమగ్రత పరీక్షకు వివిధ రూపాల్లో అడుగుతుంటారని బోర్డు వర్గాలు వివరించాయి. సందిగ్ధం ఉన్న వాటిపై ప్రిన్సిపల్ వేల్యుయేషన్‌ సూచనలను DEOలకు పంపుతున్నట్లు తెలిపాయి.

News April 4, 2026

హార్ముజ్.. కొత్త రూట్ దొరికినట్లేనా?

image

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన మూడు భారీ నౌకలు తాజాగా సేఫ్‌గా బయటపడ్డాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక బిగ్ రిలీఫ్ అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నౌకలు ఇరాన్ నిఘా కన్నుగప్పి ఇంటర్నేషనల్ షిప్పింగ్ లేన్స్‌ను కాదని ఒమన్ ప్రాదేశిక జలాల్లో నుంచి కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. దీంతో మిగిలిన దేశాలు కూడా ఇదే రూట్‌ను ప్రత్యామ్నాయంగా చూసే అవకాశం ఉంది.