News April 11, 2025
విషాదం: NIT విద్యార్థి ఆత్మహత్య

వరంగల్ జిల్లాలోని NITలో విషాదం చోటుచేసుకుంది. సంస్థలో బీటెక్ సెకండియర్ చదువుతున్న హృతిక్ సాయి అనే విద్యార్థి స్థానిక వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కులు తక్కువగా వస్తున్నాయనే ఈ ఘోరానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడి స్వస్థలం హైదరాబాద్ కాగా ఎన్ఐటీ హాస్టల్లోనే నివాసముంటున్నాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 18, 2025
ఢిల్లీ నుంచి ఏ శక్తీ తమిళనాడును పాలించలేదు: స్టాలిన్

కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు, పార్టీలను విచ్ఛిన్నం చేసే BJP వ్యూహాలు తమిళనాడులో పనిచేయవని CM స్టాలిన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కలిగించే అడ్డంకులను చట్టప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు. ‘2026లోనూ తమిళనాడులో ద్రవిడ ప్రభుత్వమే వస్తుంది. ఢిల్లీ నుంచి ఏ శక్తీ మా రాష్ట్రాన్ని పాలించలేదు. వారికి తలవంచడానికి మేం బానిసలం కాదు. నేను బతికున్నంత వరకు ఇక్కడ ఢిల్లీ ప్రణాళికలు పనిచేయవు’ అని తేల్చిచెప్పారు.
News April 18, 2025
WILDLIFE PHOTOS: గాయపడిన సింహం

అడవికి రారాజు సింహమే అయినా ఆహారం కోసం అది వేటాడాల్సిందే. ఈ ప్రక్రియలో ఒక్కోసారి అవి తీవ్రంగా గాయపడిన పరిస్థితులూ ఉన్నాయి. మనుగడ కోసం జరిగిన ఘర్షణలో గాయపడిన ఓ సింహపు ఫొటోలను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్మన్ సింగ్ హీర్ క్లిక్మనిపించారు. తలపై గాయాలు, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కనిపించింది. అడవిలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో సింహాలు ఎంతలా గాయపడతాయో ఈ ఫొటోల్లో చూపించారు.
News April 18, 2025
VIRAL: నీ కష్టం పగోడికి కూడా రావొద్దు బ్రో!

తన ప్రియురాలు తనకంటే 22 ఏళ్లు పెద్దదని తెలియడంతో ఓ యువకుడు SMలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు 26 ఏళ్లు. నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. కొన్ని రోజుల క్రితం ఆమె వయసు 27 కాదు, 48 అని తెలిసింది. ఆమె అంత వయసైనట్లు కనిపించదు. ఆమె స్నేహితులు 30+ వాళ్లే ఉండేవాళ్లు. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఇచ్చేది కాదు. ల్యాప్టాప్లో పాస్పోర్టు చూడటంతో ఇది తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి?’ అని అతను వాపోయాడు.