News March 21, 2025
విమానంలో విషాదం: గాల్లోనే పైలోకాలకు..

ఎయిర్ఇండియా విమానంలో విషాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే ప్యాసింజర్ అసీఫుల్లా అన్సారీ మృతి చెందారు. దీంతో ఢిల్లీ నుంచి బయల్దేరిన ఫ్లయిట్ను గమ్యస్థానంలో కాకుండా లక్నోలో ల్యాండింగ్ చేశారు. సీటుబెల్ట్ పెట్టుకొని చాలాసేపు కళ్లుమూసుకొని కదలకుండా కూర్చోవడంతో సిబ్బంది ఆయన్ను నిద్రలేపేందుకు ప్రయత్నించారు. లేవకపోవడంతో డాక్టర్లను పిలిచారు. ఆయన జర్నీలోనే చనిపోయారని వారు ధ్రువీకరించారు.
Similar News
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.