News April 12, 2025

విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజుజయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.

Similar News

News January 18, 2026

APలో 259కి పెరిగిన IAS క్యాడర్ బలం

image

APలో IASల కోటా పెరిగింది. రాష్ట్రంలో క్యాడర్‌ బలాన్ని కేంద్రం 239 నుంచి 259కి పెంచింది. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే ఈ మార్పు జరిగింది. ముఖ్యంగా జిల్లాల సంఖ్య పెరగడంతో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల పోస్టులను 13 నుంచి 26కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్‌ డ్యూటీ పోస్టులు కూడా 141కి చేరాయి. కొన్ని విభాగాల్లో డైరెక్టర్ పోస్టులు తగ్గించినప్పటికీ, ఓవరాల్‌గా అడ్మినిస్ట్రేషన్ బలోపేతం కానుంది.

News January 18, 2026

వాహనంలో పశువుల తరలింపు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

image

ఎండ కాస్తున్న సమయంలో, బాగా చల్లని సమయాల్లో, భారీ వర్షంలో జీవాలను రవాణా చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాత్రివేళలో మాత్రమే జీవాలను తరలించాలి. ఈ నిబంధన రోడ్డు మార్గంలో పశువుల తరలింపునకే వర్తిస్తుంది. పశువులను తీసుకెళ్లే వాహనం స్పీడ్‌ గంటకి 40 కిలోమీటర్లు మించకుండా చూసుకోవాలి. స్పీడ్‌ బ్రేకర్లు, మలుపుల వద్ద నెమ్మదిగా వెళ్లాలి.

News January 18, 2026

అల్కరాజ్ బోణీనా.. జకోవిచ్ 25వ ట్రోఫీనా!

image

టెన్నిస్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఓ వైపు స్పానిష్ సంచలనం అల్కరాజ్ AUSలో బోణీ కొట్టాలని సిద్ధమయ్యారు. మరోవైపు తనకు కలిసొచ్చిన ఓపెన్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని జకోవిచ్ చూస్తున్నారు. అటు ఇటలీకి చెందిన వరల్డ్ నం.1 సిన్నర్ హ్యాట్రిక్ టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఉమెన్స్‌లో స్టార్ ప్లేయర్స్ సబలెంకా, స్వియాటెక్ టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు.