News December 24, 2024
టెలికం కంపెనీలకు ట్రాయ్ కీలక ఆదేశాలు
వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని జియో, ఎయిర్టెల్, VI, BSNL సంస్థలను ట్రాయ్ ఆదేశించింది. ప్రస్తుతం డేటా, కాల్స్, SMSలకు కలిపి ఈ సంస్థల ప్లాన్లు ఉన్నాయి. దీంతో డేటా అవసరం లేకున్నా ఫీచర్ ఫోన్లు వాడే వారు తప్పకుండా రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తోంది. 2 సిమ్లు వాడే వారూ ఒక నంబర్ వాడుకలో ఉండేలా రీఛార్జ్ చేసుకుంటూ నష్టపోతున్నారు. త్వరలో వీరి కష్టాలు తీరే అవకాశముంది.
Similar News
News December 24, 2024
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.
News December 24, 2024
రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది
మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.
News December 24, 2024
బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?
BGTలో భారత్కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.