News August 20, 2024
స్పామ్ కాల్స్ నియంత్రణకు TRAI కీలక ఆదేశాలు

టెలీ మార్కెటింగ్ కాల్స్(14 సిరీస్‌తో ప్రారంభమయ్యే)ను బ్లాక్ చెయిన్ సాయంతో పని చేసే డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీకి మార్చాలని టెలికం కంపెనీలను TRAI ఆదేశించింది. ఇందుకు SEP 30ని గడువుగా నిర్దేశించింది. SEP 1 నుంచి వెబ్సైట్ లింకులు, ఏపీకే ఫైల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన మెసేజ్‌లు పంపకూడదని ఆదేశాల్లో పేర్కొంది. గుర్తు తెలీని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను NOV 1 నుంచి పూర్తిగా ఆపేయాలంది.
Similar News
News October 4, 2025
INDvsWI: ఫస్ట్ టెస్ట్ మనదే

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఇన్నింగ్స్& 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్సులో విండీస్ 146 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు జడేజా 4, సిరాజ్ 3, కుల్దీప్ 2 వికెట్లతో చెలరేగారు. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో విండీస్ 162 రన్స్ చేయగా భారత జట్టు 448/5(D) పరుగులు చేసింది. ముగ్గురు భారత ప్లేయర్లు సెంచరీలు చేశారు. రెండో టెస్టు 10 నుంచి జరగనుంది.
News October 4, 2025
విదేశీ కోచ్‌లపై వీధి కుక్కల దాడి.. విమర్శలు!

ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లలో షాకింగ్ ఘటన జరిగింది. అథ్లెట్లకు శిక్షణ ఇస్తుండగా కెన్యా స్ప్రింట్స్ కోచ్ డెన్నిస్ మరాగియా మ్వాన్జోను వార్మప్ ట్రాక్‌పై వీధికుక్క కరిచింది. వెంటనే ఆయనకు చికిత్స అందించారు. అంతకుముందే జపాన్ పారా అథ్లెటిక్స్ అసిస్టెంట్ కోచ్ మెయికో ఓకుమాట్సు పైనా వీధికుక్క దాడి చేయడంపై విమర్శలొస్తున్నాయి.
News October 4, 2025
H-1B వీసాల ఫీజు పెంపుపై యూఎస్ కోర్టులో దావా

H-1B <<17767574>>వీసాల <<>>జారీని కఠినతరం చేస్తూ ట్రంప్ సర్కారు లక్ష డాలర్ల ఫీజు విధించడాన్ని పలు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. ట్రంప్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ యూఎస్‌లోని శాన్ఫ్రాన్సిస్కో కోర్టును ఆశ్రయించాయి. ఆయన జారీ చేసిన ప్రకటనలో తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యత దక్కేలా చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ చెబుతున్న విషయం తెలిసిందే.