News September 13, 2025
1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.
Similar News
News April 10, 2026
BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు

నిన్న భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,400 ఎగబాకి రూ.1,40,250 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.
News April 10, 2026
ఒకట్రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలు?

TG: రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను ఈ నెల 11-13 తేదీల్లో రిలీజ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈసారి 9.97L మంది ఎగ్జామ్స్ రాయగా ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు సమాచారం. దీంతో పొరపాట్లకు తావు లేకుండా వారి ఆన్సర్ షీట్లను మరోసారి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ ఫలితాలను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ SMలో జరుగుతున్న ప్రచారాన్ని నిన్న బోర్డు <<19609277>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.
News April 10, 2026
డిజిటల్ సెన్సస్: 5.72లక్షల ఫ్యామిలీలు నమోదు

దేశ వ్యాప్తంగా ‘Census2027’ డిజిటల్ నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ‘స్వీయ గణన’ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. కాగా త్వరలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ స్వీయ గణన ప్రక్రియ ప్రారంభంకానుంది. దీనిద్వారా ఎవరికివారు ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేయవచ్చు.


