News December 10, 2024

రైలు ఆలస్యం.. గమ్యాన్ని చేరేందుకు మూడేళ్లు పట్టింది!

image

ఇండియాలో రైళ్లు ఆలస్యంగా నడవటం కామన్. ఒక్కోసారి 4 గంటల్లో గమ్యాన్ని చేరే రైలు.. అనుకోని కారణాలతో 8 గంటలూ పట్టొచ్చు. కానీ, విశాఖ నుంచి UPలోని బస్తీకి DAP బస్తాలతో బయల్దేరిన ఓ గూడ్స్ గమ్యాన్ని చేరేందుకు ఏకంగా మూడేళ్ల ఎనిమిది నెలలు పట్టింది. దీంతో దేశంలో అత్యంత ఆలస్యంగా గమ్యాన్ని చేరిన రైలుగా రికార్డులకెక్కింది. కాగా 2014 నవంబర్‌లో బయల్దేరిన ఈ రైలు ప్రమాదం కారణంగా 2018 జులై 25న గమ్యాన్ని చేరుకుంది.

Similar News

News November 3, 2025

సమీకృత వ్యవసాయంతో కలిగే ప్రయోజనాలు

image

జనాభా పెరుగుదలకు సరిపడే ఆహారం ఉత్పత్తి చేయవచ్చు. కోళ్లు, మేకలు, పందులు, గొర్రెలు, పశువుల పెంపకం వల్ల వచ్చే వ్యర్థాలను సమర్థంగా వినియోగించి భూసారాన్ని పెంచవచ్చు. సేంద్రియ ఎరువుల వాడకంతో సాగుకు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. సమగ్ర వ్యవసాయం నుంచి వచ్చే గుడ్లు, పాలు, పుట్టగొడుగులు, కూరగాయలు, తేనే వల్ల రైతులకు నికర ఆదాయం లభిస్తుంది. సమగ్ర వ్యవసాయంతో ఏడాది పొడవునా ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది.

News November 3, 2025

చెదిరిన కలలు, చెరిగిన జీవితాలు

image

21మంది చనిపోయిన మీర్జాగూడ రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. కాలేజీకి వెళ్తున్న స్టూడెంట్స్, ఉపాధి కోసం బయల్దేరిన కూలీలు, ఆస్పత్రిలో చికిత్స కోసం బస్సెక్కిన ఫ్యామిలీ, రైలు మిస్ కావడంతో బస్ అందుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో కథ, కల. కానీ అవన్నీ ఒక్క ప్రమాదంతో కల్లలయ్యాయి. కంకర టిప్పర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు అందరి జీవితాలకు రాళ్ల సమాధి కట్టింది.

News November 3, 2025

సుప్రీం కోర్టుకు రాష్ట్రాల CSలు క్షమాపణలు

image

వీధికుక్కల వ్యవహారంలో AP సహా పలు రాష్ట్రాల CSలు సుప్రీంకోర్టు ముందు హాజరయ్యారు. అఫిడవిట్ల దాఖలు ఆలస్యానికి వారు క్షమాపణలు చెప్పారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. తాము Oct 29నే అఫిడవిట్ ఇచ్చామని AP CS తెలిపారు. రాష్ట్రాల అఫిడవిట్ల ఆధారంగా స్ట్రే డాగ్స్ కోసం ఛార్ట్ రూపొందించాలని అమికస్ క్యూరీకి SC సూచించింది. కాగా కేసులో కుక్కకాటు బాధితులను ప్రతివాదులుగా చేర్చేందుకు కోర్టు అంగీకరించింది.