News March 13, 2025
TRAIN HIJACK: బందీలు విడుదల

పాకిస్థాన్ ట్రైన్ హైజాక్లో బందీలందరినీ సైన్యం విడిపించింది. 346 మందిని విడిపించినట్లు ప్రకటనలో పేర్కొంది. మొత్తం 33 మంది టెర్రరిస్టులను హతమార్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో 28 మంది పాక్ జవాన్లు, బందీల్లో 21 మంది చనిపోయినట్లు వెల్లడించింది.
Similar News
News January 27, 2026
హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు.. నటిపై క్రిమినల్ కేసులు!

లాస్ఏంజెలిస్(US)లోని హాలీవుడ్ బోర్డుపై లోదుస్తులు వేలాడదీసి నటి సిడ్నీ స్వీనీ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా బోర్డుపైకి ఎక్కి బ్రాలను దండగా కట్టి వేలాడదీశారు. ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రచారం కోసం చేసిన స్టంట్ స్వీనీకి సమస్యలు తెచ్చిపెట్టింది.
News January 27, 2026
ఐఐటీ గువాహటిలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 27, 2026
మోహన్ బాబుకు బెంగాల్ ఎక్సలెన్స్ అవార్డు

డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్ఠాత్మక అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ చేతుల మీదుగా అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలకు ఈ అవార్డు అందజేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అమితాబ్-దీపిక నటించిన ‘పీకు(piku)’ డైరెక్టర్ షూజిత్ సిర్కార్ సైతం ఈ పురస్కారం అందుకున్నారు.


