News March 14, 2025

ట్రైన్ హైజాక్: పాక్ ఆరోపణల్ని తిప్పికొట్టిన భారత్

image

బలూచిస్థాన్ ట్రైన్ హైజాక్ ఘటనలో విదేశీ జోక్యంపై పాక్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఉగ్రవాదానికి జన్మస్థానమేదో ప్రపంచం మొత్తానికీ తెలుసని పేర్కొంది. ‘పాక్ నిరాధార ఆరోపణలను మేం ఖండిస్తున్నాం. వారి అంతర్గత సమస్యలు, వైఫల్యాలకు ఇతరులను నిందించడం, వేలెత్తి చూపడం మానేసి అంతర్మథనం చేసుకోవాలి’ అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. BLAకు అఫ్గాన్ సాయం, భారత్‌పై వైఖరి మారలేదని పాక్ నిన్న ఆరోపించింది.

Similar News

News April 11, 2026

ఇదే ఫస్ట్: నెల్లూరు మీదుగా శ్రీకాకుళానికి రైలు

image

తిరుపతి నుంచి నెల్లూరు మీదుగా శ్రీకాకుళానికి డైరెక్ట్ రైలు సర్వీసుకు రంగం సిద్ధమైంది. హంసఫర్ ఎక్స్‌ప్రెస్(17439/17440) రైలు ఆదివారం సా.4.55 గం.కు TPT నుంచి బయలుదేరి రాత్రి 8.03కు నెల్లూరు చేరుకుంటుంది. ఇక్కడి నుంచి సోమవారం మ.12.30 గం.కు శ్రీకాకుళం రీచ్ అవుతుంది. బాపట్ల, రాజమండ్రి, దువ్వాడ మీదుగా వెళ్లే ఈ రైలు రూట్ మ్యాప్ కోసం <<-1>>క్లిక్<<>> చేయండి.

News April 11, 2026

గ్యాస్ లేకుండానే మంట.. ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’

image

గ్యాస్ అవసరం లేకుండానే మంటను పుట్టించే ‘ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్’ మార్కెట్లోకి వస్తోంది. ఇది విద్యుత్ ద్వారా గాలిని అయనీకరణం చేసి 1300°C వరకు వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇండక్షన్‌ స్టవ్‌లా కాకుండా దీనిపై అన్ని రకాల గిన్నెలు వాడుకోవచ్చు. గ్యాస్ లీకేజీ భయం ఉండదు. సౌర విద్యుత్ వాడేవారికి మరింత లాభదాయకం. సుమారు రూ.35,000 ధర ఉండే ఈ స్టవ్ భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్లకు ప్రత్యామ్నాయం కానుంది.

News April 11, 2026

పాలు Vs గుడ్లు.. విటమిన్-Dకి ఏది బెస్ట్?

image

భారత్‌లో 67% మంది విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. దీనికోసం అదనపు విటమిన్ కలిపిన పాలు (Fortified Milk), కోడిగుడ్డు సొన ప్రధాన ఆహార వనరులు. పరిమాణ పరంగా పాలల్లో విటమిన్-D ఎక్కువగా ఉన్నా గుడ్డు సొనలో ఉండే ‘D3’ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. కేవలం ఆహారం ద్వారానే ఈ లోపాన్ని భర్తీ చేయలేమని, రోజూ ఎండ తగిలేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎముకల బలం, రోగనిరోధక శక్తి పెరగాలంటే ఆహారం, ఎండ రెండూ అవసరం.