News September 3, 2025
జారిపడిన ప్రయాణికుడి కోసం వెనక్కెళ్లిన రైలు

AP: ప్రయాణికుడి కోసం రైలు వెనక్కెళ్లిన అరుదైన ఘటన ప్రకాశం(D) మార్కాపురంలో జరిగింది. గుంటూరు(D) బ్రాహ్మణ కోడూరుకు చెందిన హరిబాబు(35) రాత్రి సమయంలో రైలు కుదుపులకు లోనవ్వడంతో కిందపడిపోయాడు. సహచరులు వెంటనే చైన్ లాగి రైలు ఆపారు. లోకో పైలట్లు అధికారుల అనుమతితో రైలును 1.5KM వెనక్కి తీసుకెళ్లారు. అతడిని బోగీలోకి ఎక్కించి మార్కాపురంలో దింపారు. ఆస్పత్రికి తరలించినా హరిబాబు పరిస్థితి విషమించి మరణించాడు.
Similar News
News September 4, 2025
ధోనీ అభిమానులకు క్రేజీ న్యూస్!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ మరో ఏడాది ఐపీఎల్ ఆడొచ్చని క్రీడావర్గాలు వెల్లడించాయి. N శ్రీనివాసన్ తిరిగి CSK ఫ్రాంచైజీ పగ్గాలు తీసుకున్నారని, ధోనీతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాయి. మరో సీజన్ కూడా ఆడాలని శ్రీనివాసన్ ధోనీని ఒప్పించే అవకాశం ఉందన్నాయి. కాగా 44 ఏళ్ల ధోనీ గత సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడారు. ధోనీ వచ్చే సీజన్ ఆడటం అతడి ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది.
News September 4, 2025
కొనసాగుతున్న క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. PPP మోడల్‌లో కొత్తగా 10 మెడికల్ కాలేజీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలకు ఆమోదం తెలపనుంది. వివిధ సంస్థలకు భూకేటాయింపులు, యూనివర్సల్ హెల్త్ పాలసీ తయారీ, అమలుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
News September 4, 2025
GST 2.0: పెరగనున్న IPL టికెట్ రేట్లు

కేంద్రం తీసుకొస్తున్న GST 2.0తో IPL అభిమానులకు షాక్ తగలనుంది. ఇప్పటివరకు 28% జీఎస్టీ శ్లాబులో ఉన్న ఐపీఎల్ టికెట్లపై ఇకపై 40% పన్ను పడనుంది. అంటే రూ.వెయ్యి టికెట్ ఇప్పుడు రూ.1280 ధరుంటే.. ఈ నెల 22 తర్వాత అది రూ.1400కు చేరుతుంది. అయితే, టీమ్ ఇండియా ఆడే అంతర్జాతీయ మ్యాచులకు మాత్రం టికెట్ ధరపై 18% జీఎస్టీనే కంటిన్యూ అవుతుంది. దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.