News March 19, 2025

ఐదేళ్లలో రైలు టికెట్ ధరలు పెంచలేదు: కేంద్ర మంత్రి

image

దేశంలో గత ఐదేళ్లలో రైలు ఛార్జీలు పెంచలేదని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ LSలో వెల్లడించారు. పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే మన దేశంలోనే టికెట్ ధరలు తక్కువని చెప్పారు. 350 కి.మీ దూరానికి మన దేశంలో ఛార్జ్ రూ.121గా ఉంటే, పాకిస్థాన్‌లో రూ.436, బంగ్లాలో రూ.323, శ్రీలంకలో రూ.413 అని వివరించారు. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంతో పోల్చితే ఇప్పుడు 90% రైలు ప్రమాదాలు తగ్గాయన్నారు.

Similar News

News March 19, 2025

ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం: భట్టి

image

TG: గత ప్రభుత్వం సృష్టించిన సవాళ్లను ఏడాదిలోనే దాటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రజా సంక్షేమమే తమకు ముఖ్యమని చెప్పారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు.

News March 19, 2025

విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసింది: లోకేశ్

image

AP: ఐదేళ్ల పాలనలో విద్యావ్యవస్థను వైసీపీ నాశనం చేసిందని మంత్రి లోకేశ్ విమర్శించారు. పాఠశాలల్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారని అన్నారు. లోకేశ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించారనడం సరికాదని చెప్పారు. కాగా బొత్సతో చర్చకు సిద్ధమని లోకేశ్ చెప్పారు. ఐటీ సిలబస్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ఆయనను డిమాండ్ చేశారు.

News March 19, 2025

IPL: ఆ మ్యాచ్ రీషెడ్యూల్ ?

image

ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన KKRvsLSG మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశముందని క్రీడా వర్గాలు తెలిపాయి. అదే రోజు శ్రీరామనవమి ఉండడంతో కోల్‌కతా వ్యాప్తంగా భారీగా ఊరేగింపులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అటు ఊరేగింపులకు, ఇటు మ్యాచుకు భద్రత కల్పించడం పోలీసులకు సవాలుగా మారనుంది. ఈ కారణంతో మ్యాచును రీషెడ్యూల్ చేసే ఛాన్సుంది. గత ఏడాది KKRvsRR మ్యాచునూ ఇదే కారణంతో వాయిదా వేశారు.

error: Content is protected !!