News September 6, 2024

ట్రైనీ డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు: సీబీఐ వర్గాలు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆమెపై సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో అభియోగాలు దాఖలు చేయనున్నట్లు తెలిపాయి. కాగా ఈ కేసును తొలుత పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణపై అనుమానాలు రేకెత్తడంతో హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.

Similar News

News March 3, 2025

దేశంలో మహిళలకు 48% పెరిగిన JOBS

image

దేశంలో 2024తో పోలిస్తే 2025లో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 48% పెరిగాయని foundit తెలిపింది. ఎమర్జింగ్ టెక్నాలజీ రోల్స్ సహా IT, BFSI, తయారీ, హెల్త్‌కేర్ రంగాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసినట్టు పేర్కొంది. ‘భారత జాబ్ మార్కెట్ రాకెట్ వేగంతో పెరుగుతోంది. స్త్రీలకు యాక్సెస్, ఆపర్చునిటీస్ గణనీయంగా పెరిగాయి’ అని ఫౌండిట్ VP అనుపమ తెలిపారు. ఆఫీసుల్లో వారి కోసం ఏర్పాట్లు 55% మేర పెరగడం గుర్తించామన్నారు.

News March 3, 2025

ఏపీ ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని CM రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కేంద్రమంత్రి CR పాటిల్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కృష్ణా బేసిన్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తీసుకుంటోందని, దాన్ని అడ్డుకోవాలని కోరినట్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్‌పై తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చెప్పారు.

News March 3, 2025

3 రాజధానుల విధానంపై చర్చించి చెబుతాం: బొత్స

image

AP: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై YCP సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మూడు రాజధానులనేది ఆ రోజుకు మా విధానం. దానిపై ఇప్పుడు మా విధానం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతాం. అమరావతిని శాసన రాజధాని చేద్దామని అనుకున్నాం. అమరావతి శ్మశానంలా ఉందని నేను చెప్పింది వాస్తవమే. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భం మేరకు అలా మాట్లాడాను’ అని బొత్స తెలిపారు.

error: Content is protected !!