News August 27, 2024
ట్రైనీ నర్సుపై ఆటో డ్రైవర్ అత్యాచారం

ట్రైనీ నర్సుపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో నిన్న రాత్రి జరిగింది. ఇంటికెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆమె మధ్యలో డ్రైవర్ ఇచ్చిన మంచినీళ్లు తాగి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత డ్రైవర్ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడని తెలిసింది. స్పృహ వచ్చాక బాధితురాలు విషయం చెప్పడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు CCTV ఫుటేజీ సేకరించి FIR నమోదు చేశారు.
Similar News
News October 28, 2025
సేంద్రియ మల్చింగ్ – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

సేంద్రియ మల్చింగ్ మొక్క మొదళ్లకు మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా వేస్తే మొక్క కాండానికి హాని కలగదు. ఈ మల్చింగ్ ఎక్కువ దళసరిగా వేస్తే మొక్కకు నీరు, గాలి లభ్యత తగ్గిపోతుంది. ఇవి ఎక్కువ తడిస్తే చిన్న చిన్న క్రిములు, శిలీంధ్రాలు రావచ్చు. కాబట్టి, సేంద్రియ మల్చులను ఎండేలాగా తిప్పి గాలి అందే విధంగా చూసుకోవాలి. శీతాకాలం ముందు మల్చులు వేసుకుంటే మొక్క వేర్లకు, నేలకు చలి వల్ల కలిగే నష్టం తగ్గించుకోవచ్చు.
News October 28, 2025
20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల.. గుడ్‌న్యూస్ చెప్పిన చైనా

బట్టతల సమస్య యువతను కలవరపెడుతోంది. చాలామందికి యుక్తవయసులోనే బట్టతల వచ్చేస్తోంది. అలాంటి వారికి నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పరిశోధనలో సహజమైన కొవ్వు ఆమ్లాలతో తయారైన సీరం 20 రోజుల్లో జుట్టును పునరుద్ధరించిందని తెలిపారు. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్ల మూల కణాలను మేల్కొల్పుతుంది. ఎలుకలతో పాటు ఓ ప్రొఫెసర్ కాలుపై ప్రయోగించగా అది సానుకూల ఫలితాలు ఇచ్చింది.
News October 28, 2025
కర్ణాటక కాంగ్రెస్‌కు TDP కౌంటర్

AP: గూగుల్ డేటా సెంటర్‌పై కర్ణాటక కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ‘KA గూగుల్‌ను కోల్పోలేదు. దానిని మరో రాష్ట్రానికి మళ్లించారు. ఉచితాలు, సబ్సిడీల ఆశచూపి దానిని పొందారు. మేము పెట్టుబడుల కోసం అభ్యర్థించం, అడుక్కోం’ అంటూ KA కాంగ్రెస్ చేసిన ట్వీట్‌కు TDP కౌంటరిచ్చింది. ‘AP పురోగతి కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయిపోయింది. మన అభివృద్ధి వారికి కాస్త ఘాటుగా అనిపిస్తోంది’ అని ట్వీట్ చేసింది.


