News April 3, 2024
నేటి నుంచి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు శిక్షణ

TG: ఎక్సైజ్ శాఖ కానిస్టేబుళ్లకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. హైదరాబాద్ అప్పాజంక్షన్ వద్ద ఉన్న ట్రైనింగ్ అకాడమీలో మొదటి బ్యాచ్‌లో భాగంగా 125 మంది ట్రైనీలకు శిక్షణ ఇవ్వనున్నారు. 475 మంది కానిస్టేబుళ్లు ట్రైనింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. కాగా రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల శిక్షణకు ఇటీవల సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Similar News
News March 5, 2026
ఎక్కువ పిల్లల్ని కంటాం సరే.. ప్రభుత్వ సాయం ఏ మూలకు?

దేశంలో 1980-90s వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు మొగ్గుచూపేవారు. పెరిగిన ఖర్చులు, పేదరికంతో క్రమంగా ఒకరిద్దరు సంతానానికే పరిమితమయ్యారు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువతరం కొరత ఉంది. అందువల్ల ఎక్కువ మంది పిల్లలను కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని AP CM CBN <<19304777>>ప్రకటించారు.<<>> అయితే విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ ఖరీదైన సమాజంలో ఈ సాయం ఏమాత్రం సరిపోతుందనేది అతిపెద్ద ప్రశ్న. మీరేమంటారు?
News March 5, 2026
అభిషేక్ మరోసారి ఫెయిల్

T20WCలో టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి ఫెయిల్ అయ్యారు. కీలకమైన సెమీఫైనల్లో రెండో ఓవర్లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ పైనా నిర్లక్ష్యపు షాట్ ఆడి 9 పరుగులకే ఔట్ కావడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఫైనల్‌కు వెళ్తే అతడిని పక్కన పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ WCలో అభి 7 మ్యాచులు ఆడి 89 రన్స్ మాత్రమే చేశారు.
News March 5, 2026
టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ జర్నీ

AP: టెన్త్ విద్యార్థులకు APSRTC శుభవార్త చెప్పింది. హాల్‌టికెట్లను కండక్టర్లకు చూపిస్తే ఈ నెల 16 నుంచి APR 1 వరకు పరీక్షా కేంద్రాలకు, ఇంటికి ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించింది. ‘పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులను ఎక్కించుకోకుండా వెళితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతాం’ అని పేర్కొంది.


