News September 7, 2024
కశ్మీర్లో ఉగ్రవాదుల్ని అడ్డుకునేందుకు ప్రజలకు శిక్షణ

ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు గాను జమ్మూకశ్మీర్లో ప్రజలకు భారత సైన్యం శిక్షణ ప్రారంభించింది. కశ్మీర్ పోలీసులతో కలిసి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్(VDG)లను సిద్ధం చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 600మంది వరకు శిక్షణ పొందుతున్నారని, ఆటోమేటిక్ రైఫిల్స్ వాడకం, డ్రిల్స్, చిన్నపాటి మెళకువలు వారికి నేర్పిస్తున్నామని పేర్కొంది. ఒక్కో VDG విభాగానికి 3రోజుల శిక్షణ అందిస్తున్నట్లు స్పష్టం చేసింది.
Similar News
News November 25, 2025
రూ.7,50,000 ప్రశ్న.. ఆ ప్లేయర్ ఎవరు?

కౌన్ బనేగా కరోడ్పతి(KBC)లో క్రికెట్కు సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. రూ.7,50,000 విలువైన ఈ ప్రశ్నను హోస్ట్ అమితాబ్ పార్టిసిపెంట్ను అడిగారు. ఏ ఆల్రౌండర్ భారత జట్టుకు ఓటమి లేకుండా 36 T20I మ్యాచులకు ప్రాతినిథ్యం వహించారు. పైన ఫొటోలో ఆప్షన్లు ఉన్నాయి. ఇంకా మీకు హింట్ కావాలంటే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 సిరీస్లో ఆ స్ట్రీక్ ముగిసింది. ఇంతకీ ఎవరా ప్లేయర్ కామెంట్ చేయండి?
News November 24, 2025
మొబైల్ యూజర్లకు బిగ్ అలర్ట్

మొబైల్ యూజర్లకు టెలికం శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ పేరుతో ఉన్న SIM దుర్వినియోగం అయితే వినియోగదారులదే బాధ్యత అని స్పష్టం చేసింది. సిమ్ కార్డులను సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు వాడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ ఐడెంటిటీతో లింక్ అయిన సిమ్ కార్డులు, డివైస్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. <<18316809>>IMEI<<>> నంబర్లను ట్యాంపర్ చేసిన ఫోన్లను ఉపయోగించవద్దని సూచించింది.
News November 24, 2025
టికెట్ ధరల పెంపు.. తప్పుగా తీసుకోవద్దు: మైత్రీ రవి

టికెట్ ధరల పెంపుపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇండస్ట్రీ వృద్ధి కోసమే డబ్బును ఖర్చు చేస్తున్నాం. ఈ కారణంతో 6-7 సినిమాలకు టికెట్ ధరలు పెంచుతున్నాం. ఆ పెంపు రూ.100 మాత్రమే. ఈ అంశాన్ని తప్పుగా తీసుకోవద్దు’ అని చెప్పారు. కాగా టికెట్ ధరల పెంపుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే.


