News March 21, 2024

లంచగొండిల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్!

image

TG: సీవీ ఆనంద్ నేతృత్వంలోని ఏసీబీ లంచం తీసుకుంటున్న అధికారుల భరతం పడుతోంది. దీంతో లంచం అడిగిన అధికారుల వివరాలను తెలిపేందుకు బాధితులు సైతం ముందుకొస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఉమా రాణి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెయింగ్ మెషీన్‌లకు సంబంధించిన వ్యాలిడిటీ సర్టిఫికెట్ ఇవ్వడం కోసం ఆమె రూ.10వేలు డిమాండ్ చేశారు.

Similar News

News July 10, 2025

అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

image

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్‌లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.

News July 10, 2025

చేపల కోసం వల వేస్తే ‘టో ఫిష్’ చిక్కింది

image

AP: విశాఖకు చెందిన మత్స్యకారుడు అప్పన్న చేపల కోసం వల వేయగా ఎంతో విలువైన ‘టో ఫిష్’ పరికరం చిక్కింది. అదేంటో అర్థంకాక మత్స్యశాఖ అధికారులకు ఆయన సమాచారమిచ్చారు. వాళ్లకూ తెలియక నేవీ అధికారులకు చెప్పగా అది అత్యాధునిక ‘టో ఫిష్’ పరికరమని తేల్చారు. గతేడాది డిసెంబర్ నుంచి తమకు సిగ్నల్స్ తెగిపోవడంతో దాని కోసమే వెతుకుతున్నామని చెప్పారు. కాగా సముద్ర గర్భంలో అధ్యయనం చేసేందుకు ఈ పరికరాన్ని వాడుతారు.

News July 10, 2025

మరో 6 దేశాలకు టారిఫ్స్ ప్రకటించిన ట్రంప్

image

అధిక సుంకాల విధింపు గడువును US అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 1 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అప్పటికల్లా ఒప్పందాలు చేసుకోకపోతే అమెరికాకు ఎగుమతులపై పెంచిన టారిఫ్స్ కట్టాలి. రెండ్రోజుల క్రితం 14 దేశాలకు ఈ టారిఫ్స్ వివరాలతో లేఖలు పంపారు. ఇప్పుడు మరో ఆరు దేశాలకు ట్రంప్ కొత్త టారిఫ్స్‌ ప్రకటించారు. ఇరాన్-30%, అల్జీరియా-30%, లిబియా-30%. ఫిలిప్పీన్స్-25%, బ్రూనై-25%, మోల్డోవా-25% చెల్లించాలని తెలిపారు.