News October 13, 2025
నేడు విద్యుత్ ఉద్యోగ జేఏసీతో ట్రాన్స్‌కో చర్చలు

AP: సమస్యల పరిష్కారానికి ఈ నెల 15నుంచి సమ్మె చేపడతామన్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారానికి చర్చకు సోమవారం రావాలని పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి ట్రాన్స్‌కో లేఖ రాసింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొంది. ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సంస్థలు సజావుగా సాగేలా చూడాలని ఉద్యోగులను కోరింది.
Similar News
News October 13, 2025
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా?

ప్రస్తుతకాలంలో యూట్యూబ్, ఇన్‌స్టాల్లో వైరల్ అయ్యే వాటిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అవి కొనడం, వాడటం చేస్తున్నారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. సోషల్‌మీడియాలో చూపించేవన్నీ నిజం కావని చెబుతున్నారు. మంచి, చెడు మధ్య తేడా గ్రహించేలా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో చూసిన ఉత్పత్తులను చూసి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని చెబుతున్నారు.
News October 13, 2025
15 నెలలవుతున్నా మార్పులేదు: అమరావతి రైతు ఐకాస

AP: కూటమి ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కాలేదని అమరావతి రైతు ఐకాస నాయకులు వాపోయారు. అసైన్డ్ రైతుల భూములు, కౌలు చెల్లింపులు, ప్లాట్ కేటాయింపులు తదితరాలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. CRDAలో కిందిస్థాయి అధికారులు రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. CM వీలైనంత త్వరగా తమతో సమావేశం కావాలని డిమాండ్ చేశారు. లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
News October 13, 2025
నేడు, రేపు భారీ వర్షాలు

AP: మే నెల చివర్లో దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వివిధ రాష్ట్రాల నుంచి నిష్క్రమిస్తున్నాయి. 2 రోజుల్లో రాష్ట్రం నుంచి కూడా వెళ్లిపోయే ఆస్కారం ఉండగా.. 3, 4 రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ కానున్నాయి. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ప్రకాశం, ఏలూరు, ప.గో. తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.