News June 15, 2024

తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ

image

TG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా బదావత్‌ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్‌గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు.

Similar News

News December 26, 2024

వైకుంఠద్వార దర్శనం.. 9 చోట్ల టికెట్ల జారీ!

image

మార్చి-2025 నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయగా క్షణాల్లో బుక్ అయిపోయాయి. వీటితో పాటు వైకుంఠద్వార దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల విడుదలపై ప్రకటన చేసింది. 2025 జనవరి 10-12 వరకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్‌లు అందజేస్తామని తెలిపింది. వీటిని జనవరి 8న ఉదయం 5 గంటలకు తిరుపతిలోని 9 ప్రదేశాల్లో అందజేస్తారు. కాగా, ఈ పది రోజుల్లో టోకెన్లు లేకుండా దర్శనానికి అనుమతించరు.

News December 26, 2024

గ్రూప్-1పై దాఖలైన అన్ని పిటిషన్ల కొట్టివేత

image

TG: గ్రూప్-1 పరీక్షకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జీఓ నంబర్ 29, రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదాల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.

News December 26, 2024

కోడలు శోభిత గురించి నాగార్జున ఏమన్నారంటే?

image

నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పరిచయం కంటే ముందే తనకు ఆమె తెలుసని నాగార్జున చెప్పారు. ఆమె ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని కొనియాడారు. ఆమె వర్క్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ‘చైతూ జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.