News July 1, 2024

తెలంగాణలో 8 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

image

* హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా సుభాష్
* కొత్తగూడెం OSDగా పరితోష్ పంకజ్
* భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్
* ములుగు OSDగా మహేశ్ బాబాసాహెబ్
* గవర్నర్ OSDగా సిరిశెట్టి సంకీర్త్
* భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్
* ఏటూరు నాగారం ఏఎస్పీగా శివమ్ ఉపాధ్యాయ
* వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి

Similar News

News July 3, 2024

కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జులై 12 వరకు పొడిగించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు జులై 5న విచారించనుంది. కాగా కొన్ని నెలలుగా కేజ్రీవాల్ తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

News July 3, 2024

15 రోజుల్లో కుప్పకూలిన 7 బ్రిడ్జ్‌లు

image

బిహార్‌లో మరో బ్రిడ్జ్ కూలిపోయింది. సివాన్ జిల్లాలోని గండకి నదిపై నిర్మించిన వంతెన ఇవాళ తెల్లవారుజామున కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. పలు గ్రామాలకు వారధిగా ఉన్న బ్రిడ్జ్ కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా రాష్ట్రంలో 15 రోజుల్లో ఏడు బ్రిడ్జ్‌లు కూలిపోవడం గమనార్హం. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News July 3, 2024

బుద్ధి ఉన్నోళ్లెవరూ అమరావతిని తిరస్కరించరు: సీఎం చంద్రబాబు

image

AP: బుద్ధి, జ్ఞానం ఉన్న ఎవరైనా రాష్ట్ర రాజధానిగా అమరావతిని కాదనలేరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మూలకైనా సమాన దూరంలో ఉండేలా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. తమ అధ్యయనంలో అత్యధిక శాతం మంది విజయవాడ, గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలని చెప్పారని, ఆ విధంగానే ముందుకెళ్లామని వివరించారు.