News July 11, 2024

ఏపీలో 9 మంది ఐపీఎస్‌ల బదిలీ

image

AP: రాష్ట్రంలో 9 మంది IPSలు బదిలీ అయ్యారు. SPF డీజీగా అంజనా సిన్హా, లా అండ్ ఆర్డర్ DGగా సీహెచ్ శ్రీకాంత్, విజయవాడ CPగా రాజశేఖర్ బాబు, అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్, లాజిస్టిక్స్ ఐజీగా PHD రామకృష్ణ(పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు), కర్నూలు రేంజ్ DIGగా కోయ ప్రవీణ్, గ్రే హౌండ్స్ IGగా గోపీనాథ్ జెట్టి, DGP ఆఫీసులో రిపోర్ట్ చేయాలని విశాల్ గున్నీ, విజయరావులను GOVT ఆదేశించింది.

Similar News

News November 22, 2025

ONGCలో 2,623 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఆయిల్ & నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)లో 2,623 అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేయడానికి NOV 25 ఆఖరు తేదీ. ఈ నెల 17వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నవారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వెబ్‌సైట్: ongcindia.com/

News November 22, 2025

వంటింటి చిట్కాలు

image

– చపాతీ పిండి మిగిలిపోతే దానిపై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి, గాలి వెళ్లని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
– ఫ్రిజ్‌లో అక్కడక్కడ కొద్దిగా పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
– కూరల్లో కారం ఎక్కువైతే అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా నెయ్యి వేస్తే కారం తగ్గుతుంది.
– కాఫీ టేస్టీగా రావాలంటే డికాషన్‌‌‌లో చిటికెడు ఉప్పు వేయాలి.
– ఆపిల్ పండ్ల పక్కనే పెడితే అరటి పండ్లు త్వరగా పండుతాయి.

News November 22, 2025

వనజీవి జీవితంపై సినిమా మొదలు!

image

తెలంగాణ ‘వనజీవి’గా పేరుగాంచిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య జీవిత చరిత్ర సినిమా రూపంలో తెరకెక్కనుంది. ఖమ్మంలో ఈ బయోపిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు. వనజీవి రామయ్య తన జీవితాన్ని లక్షలాది మొక్కలను నాటడానికి, రక్షించడానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆదర్శవంతమైన, నిరాడంబర జీవన విధానం, పర్యావరణ భక్తిని ఈ సినిమా వెండితెరపైకి తీసుకురానుంది. ఆయన పాత్రలో నటుడు బ్రహ్మాజీ కనిపించనున్నారు.