News October 29, 2024
ఆస్తుల పంపకం అవాస్తవం: విజయమ్మ

AP: వైఎస్సార్ బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం చేశారన్నది అవాస్తవమని వైఎస్ విజయమ్మ వెల్లడించారు. ‘విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉండటంతో ఆయనకు అన్ని తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా సాక్షి సంతకం పెట్టారు. కానీ ఇద్దరూ స్పృహ లేకుండా అవాస్తవాలు మాట్లాడారు. జగన్, షర్మిల పెరుగుతున్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిల పేరిట రాజశేఖర్ రెడ్డి రాశారు. ఇది ముమ్మాటికీ ఆస్తుల పంపకం కాదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News December 5, 2025
బ్యాగ్ కొనే ముందు..

ఒకప్పుడు హ్యాండ్ బ్యాగ్ అలంకారమే కావొచ్చు. కానీ ఇప్పుడు అవసరం. అందుకే దీన్ని ఎంచుకొనేటప్పుడు టిప్స్ పాటించాలంటున్నారు నిపుణులు. బ్యాగు కొనేముందు ఏ అవసరానికి కొంటున్నారో స్పష్టత ఉండాలి. అందులో పెట్టే వస్తువులను బట్టి దాని పరిమాణం ఉండాలి. అంతేకాకుండా అది మీ శరీరాకృతికి నప్పేలా ఉండాలి. పొట్టిగా ఉన్నవారికి పెద్ద బ్యాగులు అంతగా నప్పవు. నాణ్యత బాగుండాలి. లోపలి లైనింగ్ వాటర్ ప్రూఫ్ అయి ఉంటే మరీ మంచిది.
News December 5, 2025
మీరు ఇలాగే అనుకుంటున్నారా?

మనం అనేక వ్రతాలను ఆచరిస్తాం. ఏదో ఒక రోజున మన కోరిక నెరవేరినప్పుడు, అది చివరి సారి చేసిన వ్రత ఫలితమే అనుకుంటాము. ఆ ఒక్క వ్రతాన్నే గొప్పదని భావిస్తాము. అంతకుముందు చేసిన వ్రతాల శక్తిని తక్కువగా అంచనా వేస్తాము. కానీ, ఈ విజయం అన్ని వ్రతాల సంచిత ఫలితమని గ్రహించాలి. ఒక దుంగ నూరవ దెబ్బకు పగిలితే, అందుకు మొదటి 99 దెబ్బలు ఎలా కారణమవుతాయో మనం చేసిన చిన్న చిన్న వ్రతాల ఫలితాలు కూడా అంతే. ఏ వ్రతం చిన్నది కాదు.
News December 5, 2025
రెండేళ్లలో 6 గ్యారంటీలకు ₹76,382 కోట్లు

TG: రెండేళ్ల పాలనలో 6 గ్యారంటీల అమలుకు ₹76,382 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి ₹8,402Cr, ₹500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్కు ₹700Cr, గృహజ్యోతి ₹3,438Cr, ఇందిరమ్మ ఇళ్లకు ₹3,200 Cr, ఆరోగ్యశ్రీ ₹3,000 Cr, రైతు భరోసా ₹20,616Cr, యంగ్ ఇండియా స్కూళ్లకు ₹15,600Cr ఖర్చు చేసినట్లు వెల్లడించింది. రెండేళ్లలో 61,379 ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది.


