News January 12, 2025

భవన నిర్మాణాల అనుమతుల అధికారం మున్సిపాలిటీలకు బదిలీ

image

AP: భవన నిర్మాణాలు, లేఔట్‌లకు అనుమతులిచ్చే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. గతంలో పట్టణాభివృద్ధి సంస్థ అనుమతులు ఇస్తుండగా, ఆ అధికారాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర, గ్రామ పంచాయతీలకు బదిలీ చేసింది. ప్రజల సౌలభ్యం కోసం నిబంధనలను సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే నగర పంచాయతీల్లో 3 ఎకరాలపైన లేఔట్ ఉంటే డీటీసీపీ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది.

Similar News

News January 12, 2025

కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ కెప్టెన్ <<15055540>>కరుణ్ నాయర్<<>> ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాయర్ (122*) మరో సెంచరీ బాదారు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. 82 బంతుల్లోనే 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 122 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. నాయర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో విదర్భ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

News January 12, 2025

హింసా రాజకీయాలకు సీఎం రేవంత్ ప్రోత్సాహం: హరీశ్ రావు

image

TG: INC ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసం చేసిందని BRS MLA హరీశ్ రావు విమర్శించారు. ప్రజలు ఆరు గ్యారంటీలను ప్రశ్నించకుండా ఉండేందుకు CM రేవంత్ హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రైతు కూలీలు, అన్ని రకాల వడ్లకు బోనస్, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా స్పందించడం లేదని ఫైరయ్యారు. ఉపాధి హామీ పనులకు వెళ్లేవారు కూడా రైతు కూలీలేనని, వారికి కూడా రూ.12,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News January 12, 2025

మార్చి 21 నుంచి ఐపీఎల్ ప్రారంభం

image

ఈ ఏడాది మార్చి 21 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ జరుగుతుందని చెప్పారు. బీసీసీఐ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్‌కు కొత్త కమిషనర్‌ను ఎన్నుకుంటామని వెల్లడించారు. కాగా తొలుత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభమవుతుందని శుక్లా ప్రకటించారు. అనంతరం 21నే ప్రారంభిస్తామని చెప్పారు.