News May 15, 2024

తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి, ప్రభాకర్ రెడ్డి తరలింపు..

image

AP: ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పరిస్థితి సద్దుమణగకపోవడంతో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు తాడిపత్రి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. అక్కడ రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్రబలగాలు సైతం పహారా కాస్తున్నాయి.

Similar News

News January 11, 2025

Podcast: గోద్రా అల్లర్లపై మోదీ ఏమన్నారంటే?

image

2002 గోద్రా అల్లర్ల సమయంలో రైలు తగలబెట్టిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని PM మోదీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘ఘటన గురించి తెలియగానే అక్కడికి వెళ్తానని అధికారులు చెప్పా. కానీ సింగిల్ ఇంజిన్ చాపర్ మాత్రమే ఉండటంతో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. చాలాసేపు వాదించి ఏం జరిగినా నేనే బాధ్యుడినని చెప్పా. గోద్రాలో మృతదేహాలను చూసి చలించిపోయా. కానీ ఓ హోదాలో ఉన్నందున ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నా’ అని చెప్పారు.

News January 11, 2025

BREAKING: ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి

image

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ బస్సి గోబీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన ఇంట్లో గన్ షాట్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు అర్ధరాత్రి 12 గంటలకు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. ఆయనే గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేక మిస్ ఫైర్ జరిగి చనిపోయారా? అనేది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని చెప్పారు.

News January 11, 2025

అది యాడ్ or వార్నింగ్? PIA ఫొటోపై సెటైర్లు

image

నాలుగేళ్ల తర్వాత పారిస్‌కు విమానాలను ప్రారంభిస్తున్నామంటూ పాక్ ఎయిర్‌లైన్స్ చేసిన పోస్టు ట్రోల్‌కు గురవుతోంది. ‘పారిస్.. మేం వస్తున్నాం’ అంటూ ఐఫిల్ టవర్ వైపు విమానం దూసుకెళ్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది. దీంతో ‘US ట్విన్ టవర్స్‌పై లాడెన్ దాడి తరహాలో ప్లాన్ చేశారా? అది ప్రకటనా? లేక వార్నింగా?’ అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరాచీలో విమానం క్రాష్ తర్వాత ఆ ఎయిర్‌లైన్స్‌ను EU బ్యాన్ చేసింది.