News April 13, 2025

రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ!

image

AP: రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియాను చేనేతశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలాగే ఐటీశాఖ సెక్రటరీ కె.భాస్కర్‌కు ఏపీహెచ్ఆర్‌డీఏ డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు, సీసీఎల్ ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మికి రెవెన్యూశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

Similar News

News November 27, 2025

సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్‌తో ఈజీగా..

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్‌లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It

News November 27, 2025

వికారాబాద్‌ జిల్లాలో భూప్రకంపనలు

image

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.

News November 27, 2025

ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

image

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.