News August 20, 2024

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ

image

GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్‌‌గా ఉన్న ఆమ్రపాలికి పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఎండీగా దాన కిశోర్‌ను నియమించింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, HMDA జాయింట్ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ, హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మయాంక్ మిట్టల్‌, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్‌గా చాహత్ బాజ్‌పెయిని బదిలీ చేసింది.

Similar News

News October 20, 2025

విష్ణుమూర్తిని వరమడిగిన భూదేవి

image

సంధ్యా సమయాన కలవడం వల్ల జన్మించిన నరకాసురుడికి అసుర లక్షణాలు వస్తాయని విష్ణుమూర్తి, భూదేవికి చెప్పాడు. భవిష్యత్తులో విష్ణుమూర్తి చేతిలోనే తన బిడ్డకు సంహారం తప్పదని భయపడిన భూదేవి, తన పుత్రుడికి రక్షణ వరం ప్రసాదించమని వేడుకుంది. దానికి విష్ణువు సమ్మతించి, తల్లి చేతిలోనే మరణం ఉంటుందని వరమిచ్చాడు. ఏ తల్లి తన బిడ్డను చంపదని భావించి భూదేవి సంతోషించింది. అనంతరం నరకుడిని జనక మహారాజుకు అప్పగించింది.

News October 20, 2025

అల్లారు ముద్దుగా పెరిగిన నరకాసురుడు

image

జనకుడు, నరకాసురుడ్ని తన కొడుకుతో సమానంగా పెంచాడు. కానీ, ఆ అసురుడు నేనే బలవంతుడ్ని అనే అహంకారంతో అకృత్యాలు చేయసాగాడు. ఈ ఆగడాలను భరించలేని జనకుడు, నరకాసురుడ్ని భూదేవికి అప్పగించేశాడు. అప్పుడా బాధ్యత విష్ణుమూర్తిపై పడింది. దీంతో ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా ప్రకటించాడు. అయినా ఆగడాలు ఆపలేదు. సహజ శక్తికి వరాలు తోడవ్వడంతో స్వర్గంపైకి దండెత్తాడు. మితిమీరిన అరిషడ్వార్గాల వల్ల చీకట్లో కూరుకుపోయాడు.

News October 20, 2025

అందుకే చెడు సావాసం వద్దంటారు

image

నరకాసురుడిలో అసుర లక్షణాలు ఉన్నప్పటికీ బాణాసురుడు అనే రాక్షసునితో స్నేహం మొదలయ్యే దాకా అవి బయట పడలేదు. ఈ చెడు సావాసంతో అతనిలో రాక్షస ప్రవృత్తి పెరిగింది. దీంతో మునులను పీడించాడు. మదంతో అదితి కుండలాలను అపహరించాడు. కామంతో 16K రాజకన్యలను చెరపట్టాడు. అత్యాశతో లోకాన్ని జయించబోయాడు. అందుకే నరకాసురుడి వధ తప్పలేదు. చెడు స్నేహం మనలోని బలహీనతలకు బలమిచ్చి, పతనానికి దారి తీస్తుంది అనడానికి ఈ కథే నిదర్శనం.