News July 16, 2024
నేటి నుంచి అధ్యాపకుల బదిలీ.. గైడ్‌లైన్స్ ఇవే

TG: ఇంటర్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024, జూన్ 30 నాటికి ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్నవారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కానున్నారు. రెండేళ్ల సర్వీస్ పూర్తయిన వారూ బదిలీకి అప్లై చేయవచ్చు. 2026 జూన్ 30/ఆలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నేటి నుంచి ఈనెల 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది.
Similar News
News October 23, 2025
HYDలో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్

TG: USకు చెందిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. HYDను ఎంచుకోవడాన్ని CM స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రాన్ని 2047నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ఆయన వారికి వివరించారు.
News October 23, 2025
బంగ్లాదేశ్‌కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.
News October 23, 2025
కఠినంగా వ్యవహరించాల్సిన టైం వచ్చింది: CBN

AP: తిరువూరు <<18082832>>వ్యవహారాన్ని<<>> CM చంద్రబాబు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీనిపై పల్లా శ్రీనివాసరావుతో దుబాయ్ నుంచి మాట్లాడినట్లు సమాచారం. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని CMకు పల్లా చెప్పగా.. చర్చించాల్సిన అవసరం లేదని, UAE నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరూ అనవసర చర్చకు తావిచ్చారని, కఠినంగా వ్యవహరించాల్సిన టైం వచ్చిందని పల్లాతో CM చెప్పినట్లు సమాచారం.