News January 31, 2025
అప్పటి లోపు టీచర్ల బదిలీ పూర్తి: మంత్రి లోకేశ్

AP: మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా టీచర్ల బదిలీ పూర్తి చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉమ్మడి AP, నవ్యాంధ్రలో 80% టీచర్ల నియామకం చేసింది మేమే. ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వ నిర్ణయాల్లో టీచర్ల అభిప్రాయాలుంటాయి. విద్యాశాఖ కమిషనర్ ప్రతి శుక్రవారం వారి సమస్యలు వింటున్నారు. బదిలీల్లో పారదర్శకత కోసం ట్రాన్స్ఫర్ యాక్ట్ తెస్తున్నాం’ అని చెప్పారు.
Similar News
News November 28, 2025
పల్నాడు: వెంటపడొద్దు అన్నందుకు చంపేశారు..!

బొల్లాపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. రేమిడిచర్లలో శామ్యేల్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. యువతి తన తండ్రికి చెప్పడంతో ఆయన సదరు యువకుడిని తన కూతురు వెంట పడొద్దని హెచ్చరించాడు. కక్ష పెంచుకున్న యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి తండ్రిని రాడ్డుతో తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI షమీర్ బాషా తెలిపారు.
News November 28, 2025
NIEPVDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజ్యువల్ డిజబిలిటిస్ (<
News November 28, 2025
స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనాలు

AP: దోమల నివారణకు ఉపయోగించే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర మేపర్‌ఫ్లూథ్రిన్ అనే పురుగుమందు ఉన్నట్లు తేలింది. ఇటీవల విజయవాడలోని ఓ షాపులో తనిఖీలు చేసి స్లీప్‌వెల్ అగరబత్తీల నమూనాలను అధికారులు సేకరించారు. వాటిని HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్కు పంపగా ప్రాణాంతక కెమికల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీనివల్ల శ్వాసకోశ, నాడీ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


