News August 3, 2024

వ్యవసాయ శాఖలో ఇవాళ్టి నుంచి బదిలీలు

image

TG: రుణమాఫీతో ఇన్నిరోజులు వాయిదా పడిన బదిలీలు ఇవాళ్టి నుంచి వ్యవసాయ శాఖలో జరగనున్నాయి. మ.1.30 నుంచి 3 గంటల వరకు 1వ మల్టీజోన్‌లోని గ్రేడ్-1 AEOలను బదిలీ చేస్తారు. ఆ తర్వాత జోన్-1,2,3,4 పరిధిలోని AEOలు, గ్రేడ్-2 AEOల బదిలీలు నిర్వహిస్తారు. మ.3 గంటల నుంచి మల్టీజోన్-2లోని గ్రేడ్-1 AEOలు, అనంతరం జోన్-5,6,7, గ్రేడ్-2 AEOల బదిలీల కౌన్సెలింగ్ జరుపుతారు. ఆ తర్వాత మండల, జిల్లా అధికారుల బదిలీలు ఉంటాయి.

Similar News

News March 11, 2026

వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

image

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.

News March 11, 2026

సంచలన తీర్పు.. కారుణ్య మరణానికి సుప్రీం అనుమతి

image

సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిస్తూ 32 ఏళ్ల హరీశ్ రాణాకు కారుణ్య మరణం (Passive Euthanasia) కింద వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అనుమతించింది. దేశంలో ఇటువంటి కేసు ఇదే మొదటిది కావడం గమనార్హం. 100% వైకల్యంతో రాణా 12 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ఆయనకు లైఫ్ సపోర్ట్ తొలగించాలని ధర్మాసనం సూచించింది. కోలుకునే అవకాశం లేనప్పుడు గౌరవప్రదంగా మరణించే హక్కు వ్యక్తికి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.