News September 7, 2024
తెలంగాణలో IPSల బదిలీలు

తెలంగాణలో పలువురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. HYD సీపీగా సీవీ ఆనంద్, విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News January 22, 2026
దాడి చేయకపోయినా అణ్వస్త్రాలతో 40 లక్షల మంది మృతి!

1945-2017 మధ్య న్యూక్లియర్ వెపన్స్ వల్ల లక్షలాది ముందస్తు మరణాలు సంభవించినట్లు ‘నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్’ రిపోర్ట్ వెల్లడించింది. అదేంటి.. హిరోషిమా, నాగసాకి తర్వాత అణ్వస్త్రాల దాడి జరగలేదు కదా అనుకుంటున్నారా? అయితే ఈ వెపన్స్ టెస్టింగ్స్ వల్ల దాదాపు 40 లక్షల మంది తమ జీవితకాలం కంటే ముందే చనిపోయారని నివేదిక తెలిపింది. 9 దేశాల్లో 2,400కు పైగా న్యూక్లియర్ వెపన్స్ పరీక్షలు జరిగినట్లు వెల్లడించింది.
News January 22, 2026
100% హోమ్ లోన్.. RBI రూల్ ఏంటి?

డౌన్ పేమెంట్ లేకుండా బ్యాంక్ లోన్తో ఇల్లు కొనుగోలు చేయొచ్చని ప్రసారమయ్యే యాడ్స్లో నిజం లేదు. RBI నిబంధనల ప్రకారం బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రాపర్టీ విలువలో 100%కి లోన్ ఇవ్వవు. పర్సనల్ సేవింగ్స్ నుంచి కొనుగోలుదారుడు కొంత మొత్తాన్ని తప్పకుండా చెల్లించాలి. రూ.30లక్షల వరకు ఉన్న ప్రాపర్టీకి 90%, రూ.30లక్షల-75లక్షల వరకు 80%, రూ.75లక్షల కంటే ఎక్కువైతే 75% వరకు మాత్రమే లోన్ మంజూరు చేయొచ్చు.
News January 22, 2026
మహాశివరాత్రి ఏరోజు జరుపుకోవాలి?

మహా శివరాత్రి ఏటా మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున వస్తుంది. సాధారణంగా హిందూ పండుగలు ఉదయం పూట తిథి ఉన్న రోజున జరుపుకుంటారు. కానీ శివరాత్రికి మాత్రం రాత్రి సమయంలో తిథి ఉండటం ప్రధానం. ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 (ఆదివారం) సా.4.47కి ప్రారంభమై 16న (సోమవారం) సా.5.32కి ముగియనుంది. అర్ధరాత్రి చతుర్దశి ఉన్న 15వ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.


