News November 16, 2024
ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు!

AP: YCP ప్రభుత్వం తీసుకొచ్చిన GO-117 రద్దు, బదిలీల చట్టంపై ఈ నెల 30న డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందుతాయి. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలను DEC 20 నుంచి 3 విడతల్లో సేకరిస్తారు. HMలకు APR 10-15, స్కూల్ అసిస్టెంట్లకు APR 21-25, SGTలకు మే 1-10 వరకు బదిలీలు ఉంటాయి. వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ వంటి వాటిని అమలుచేయడమే జీవో-117 ఉద్దేశం.
Similar News
News October 22, 2025
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనని, జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. గతంలో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె <<16044331>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
News October 22, 2025
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం