News September 13, 2024

ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు: సీఎం రేవంత్

image

TG: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను స్ట్రీమ్‌లైన్ చేయడానికి ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హోమ్‌గార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించాలన్నారు. ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంపై ప్రధానంగా దృష్టిసారించాలని తెలిపారు.

Similar News

News March 28, 2026

వృద్ధ తల్లిదండ్రులకు భరోసా.. నేడు అసెంబ్లీలో బిల్లు

image

TG: ప్రభుత్వ ఉద్యోగుల వృద్ధ తల్లిదండ్రుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ‘TEAMPS’ బిల్లును ప్రవేశపెట్టనుంది. అమ్మానాన్నలను నిర్లక్ష్యం చేసే ఉద్యోగుల శాలరీ నుంచి 15% లేదా ₹10 వేల వరకు కోత విధించి వారికి అందించడమే దీని లక్ష్యం. మంత్రి లక్ష్మణ్‌ దీన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు మంత్రి సీతక్క ‘పంచాయతీరాజ్ బిల్లు-2026’, Dy.CM భట్టి 2025-26 సవరణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

News March 28, 2026

గుడికి వెళ్లినప్పుడు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి?

image

శివాలయాలు, హనుమాన్ దేవాలయాలకు వెళ్లినప్పుడు ముందుగా ఆ ఆలయంలోని ప్రధాన దైవాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాతే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. శాస్త్రాల ప్రకారం మూలవిరాట్టును దర్శించి బయటకు వచ్చాక నవగ్రహ మండపం వద్దకు వెళ్లి పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయ్యాక మరోసారి ప్రధాన దైవాన్ని దర్శించుకుని, ఆపై ఇంటికి వెళ్లడం వల్ల సంపూర్ణ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

News March 28, 2026

ఆయిల్ పామ్ సాగు.. అబ్లేషన్ వల్ల లాభమేంటి?

image

ఆయిల్ పామ్ సాగులో మొక్క నాటిన 14 నుంచి 18 నెలల తర్వాత పుష్పిస్తుంది. ఈ పూలగుత్తులు లేతదశలో ఉన్నప్పుడు అబ్లేషన్ సాధనం ఉపయోగించి తుంచి వేయాలి. దీని వల్ల వేరువ్యవస్థ బాగా అభివృద్ధిచెంది నీరు మరియు పోషకాలను గ్రహించి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. మొక్క 30 నెలల వయసు వరకు అబ్లేషన్ విధానంలో పూగుత్తులను తొలగించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.