News July 12, 2024

వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌లేట్ మెసేజ్’ ఫీచర్

image

వాట్సాప్‌లో ‘ట్రాన్స్‌లేట్ మెసేజ్’ అనే ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా చాట్ సెక్షన్‌లోనే మెసేజ్‌లను ఒక భాషలో నుంచి మరో భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ లైవ్ ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుందని, మెసేజులు మాత్రం సెక్యూర్డ్‌గా ఉంటాయని వాబీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునేందుకు లాంగ్వేజ్ పాక్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Similar News

News November 6, 2025

నాలుగో టీ20.. భారత్ స్కోర్ 167

image

ఆస్ట్రేలియాతో 4వ టీ20లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 167/8 రన్స్ చేసింది. తొలి వికెట్‌కు అభిషేక్(28), గిల్(46) మంచి ఆరంభం అందించినా మిడిల్ ఆర్డర్ రాణించలేదు. దూబే 22, సూర్య 20 రన్స్ చేయగా తిలక్(5), జితేశ్(3), సుందర్(12) ఘోరంగా విఫలమయ్యారు. చివరి ఓవర్‌లో అక్షర్(ఫోర్, సిక్సర్) మెరుపులతో IND ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. అటు ఆసీస్ బౌలర్లలో జంపా, ఎల్లిస్ చెరో 3 వికెట్లు తీశారు.

News November 6, 2025

ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్‌ కొన్నాడు.. గెలవడంతో!

image

రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.

News November 6, 2025

నఖ్వీపై తాడోపేడో తేల్చుకొనే పనిలో BCCI

image

దుబాయ్‌లో ఈనెల 7న జరిగే ICC మీటింగ్‌లో ACC అధ్యక్షుడు నఖ్వీపై తాడోపేడో తేల్చుకోవాలని BCCI నిర్ణయించుకుంది. ఆసియాకప్‌ విజేత ఇండియా టీమ్‌కు ట్రోఫీ అప్పగించకపోవడంపై నిలదీయనుంది. నఖ్వీపై పలు అభియోగాలనూ సిద్ధం చేసింది. పాక్ మంత్రిగా ఉన్న ఆయన ACC పదవికి అనర్హుడని, తప్పించాలని వాదించనుంది. దీనికి AFG బోర్డూ మద్దతు తెలిపే అవకాశముంది. కాగా ఈ భేటీకి నఖ్వీ గైర్హాజరు కావచ్చని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.