News May 30, 2024
న్యూయార్క్ పయనం

టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అమెరికా బయలుదేరారు. గురువారం రాత్రి అతడు ముంబై విమానాశ్రయంలో అమెరికా ఫ్లైట్ ఎక్కారు. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత బీసీసీఐ అనుమతితో కొన్ని రోజులు కుటుంబసభ్యులతో గడిపారు. రెండు రోజుల్లో పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండటంతో న్యూయార్క్ పయనమైన కోహ్లీ శుక్రవారం భారత జట్టుతో కలవనున్నారు.
Similar News
News April 6, 2026
ఓవైపు ఎండలు.. మరోవైపు వానలు

AP: రాష్ట్రంలో ఓవైపు ఎండలు దంచికొడుతుండగా మరోవైపు వానలు కురుస్తున్నాయి. నిన్న మన్యం(D) వీరఘట్టం, నెల్లూరు(D) నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు శ్రీకాకుళం, నెల్లూరు, మన్యం తదితర జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈరోజు SKL, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు <<19576125>>వర్షాలు<<>> పడతాయని APSDMA వెల్లడించింది.
News April 6, 2026
పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>
News April 6, 2026
డ్రైవింగ్ లైసెన్స్ జారీకి త్వరలో కొత్త నిబంధన!

TG: డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు త్వరలో రోడ్ సేఫ్టీ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి వీటి కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక వచ్చాక కొత్త రూల్ అమల్లోకి వచ్చే అవకాశముంది.


